TRS : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీల హంగామా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీ పెట్టటానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా తెలంగాణలో రాజకీయ దుమారం లేపుతుంది. ఆమె పెట్టబోయే పార్టీ వలన లాభపడేది ఎవరు..? నష్టపోయేది ఎవరు..? అనేది అర్ధం కానీ విషయం. ఇదిలా ఉంటే మరోపక్క తెరాస లో కీలక నేత ఒకరు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు తెరాస వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది.
టీఆర్ఎస్‌లో నిరాదరణకు గురవుతున్న ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌లోని కొంత మంది ముఖ్యులు ఈ పార్టీ పనిలో ఉన్నారని టీఆర్ఎస్ ముఖ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొందరు కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారని.. వేరే పార్టీలకు అవకాశం లేదని గంగుల చెబుతున్నారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని తేల్చేశారు. కొత్త పార్టీ పెట్టె నేతలు ఎవరయ్యా అంటే మంత్రి ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
గత కొద్దీ కాలంగా సీఎం కేసీఆర్ కు ఈటెలకు మధ్య అంతగా పొసగటం లేదనే విషయం అందరికి తెలుసు, గతంలోనే ఈటెల బహిరంగంగా ఉద్యమ నేతలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని, అసలు తెరాస అంటేనే ఉద్యమ నేతల పార్టీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు , అప్పటినుండి గులాబీ పార్టీలో ఉద్యమ నేతలు వర్సెస్ బంగారు తెలంగాణ నేతలు అన్నట్లు పరిస్థితి మారిపోయింది.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీలోని సీనియర్ నేతలకు ఒక్కో జిల్లా బాధ్యతలు అప్పగించాడు కేసీఆర్. అయితే ఈటెల రాజేందర్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. పైగా ఎమ్మెల్సీ మరియు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై చర్చించటానికి ఏర్పరిచిన సమావేశానికి ఈటెలకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనితో ఈటెల కరీంనగర్ వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దీనితో ఈటెల బాగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది.
అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు పార్టీ పెట్టె పరిస్థితిలో లేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. సొంతగా పార్టీ పెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా నడిపించటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక వేళా ఈటెల పార్టీ పెడితే అందులో తెరాస కు చెందిన కీలక ఉద్యమ నేతల హస్తం ఉంటే తప్ప, సొంతగా మాత్రం ఈటెల రాజేందర్ పార్టీ పెట్టె యోచనలో లేడు . కానీ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం సమయం చిక్కిన ప్రతిసారి కొందరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఒక్క మంత్రి గంగుల కమలాకర్ ఒక్కడే కొత్త పార్టీ గురించి మాట్లాడుతున్నాడు తప్పితే , మిగిలిన తెరాస నేతలెవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బహుశా అతనికి మాత్రమే పార్టీ హైకమెండ్ ఈ విషయంలో పర్మిషన్ ఇచ్చింది ఏమో.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.