Magunta Sreenivasulu Reddy : మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు రాలేదా ?
Magunta Sreenivasulu Reddy : దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చాలామంది రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల పేర్లు రావటం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు. వారికి వరుస కస్టడీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ చివరి దశకు రావటంతో…ఈడీ వేగవంతంగా దర్యాప్తు చేస్తూ ఉంది. దీనిలో భాగంగా నిన్న ఎమ్మెల్సీ కవితను దాదాపు పది గంటల పాటు విచారించడం జరిగింది. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి… తనయుడు రాఘవరెడ్డి పేర్లు చార్జ్ షీటులో ఉండటం తెలిసిందే.
అయితే రాఘవరెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారు. దీంతో ఆయన తండ్రి శ్రీనివాసుల రెడ్డికి కూడా కష్టాలు తప్పవని టాక్ బలంగా జరుగుతుంది. దీనిలో భాగంగా ఈనెల 18వ తారీకు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది అన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఆరోజు హాజరు కాకపోవటంతో మినహాయింపు కోరారని అందరూ అనుకున్నారు. మళ్లీ ఈనెల 20వ తారీఖున రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కవితను ఆయన ఎదురుగా కూర్చోబెట్టి సౌత్ గ్రూపు లావాదేవీలపై ప్రశ్నించబోతూన్నట్లు
అందుకే ఈనెల 20వ తారీకు విచారణకు హాజరుకావాలని ప్రచారం జరిగింది. కానీ ఆరోజు ఎక్కడ కూడా మాగుంట హాజరు కాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాగుంట శ్రీనివాసుల రెడ్డికి అసలు నోటీసులే వెళ్లలేదట. తనకు నోటీసులు అందకుండానే మీడియా అతిగా ప్రచారం చేస్తుందని వాపోతున్నారట. కవితనీ పిలిచిన వాళ్ళు మాగుంటని ఎందుకు పిలవలేదన్న చర్చ జరుగుతుంది. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి విచారణకు సంబంధించి వచ్చిన నోటీసుల వార్తలలో వాస్తవం లేదని బయట జనాలు భావిస్తున్నారు.