YSRCP : వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులకు.. కోఆర్డినేటర్స్ కి సంబంధించి భారీ మార్పులు.. బడా నేతలకు షాక్ లు..!!
YSRCP : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ సమన్వయకర్తలకి సంబంధించి కొత్త లిస్టు అధిష్టానం విడుదల చేయడం జరిగింది. ఈ లిస్టులో కొంతమంది పై వేటుపడితే మరి కొంతమందిపై బదిలీ వేటు పడింది. ఇదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి మాజీ మంత్రులు కొడాలి నాని ఇంకా అనిల్ కుమార్ యాదవ్ లను తపిస్తూ ఈ బడా నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక తాజాగా వైసీపీ అధిష్టానం.. జిల్లా అధ్యక్షుల కొత్త లిస్టు ఈ విధంగా ఉంది.
వైసీపీ జిల్లా అధ్యక్షుల కొత్త లిస్టు
విశాఖపట్నం – మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ (అవంతి శ్రీనివాస్ ను తప్పించారు)
అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
కాకినాడ – కురసాల కన్నబాబు
కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
తూర్పు గోదావరి – జక్కంపూడి రాజా
పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాధరాజు
ఏలూరు – ఆళ్ల నాని
కృష్ణా – పేర్ని నాని
ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాస్
గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్ (మేకతోటి సుచరిత తప్పుకున్నారు)
బాపట్ల – మోపిదేవి వెంకటరమణ
పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాసు (మార్పులేదు)
విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు (పుష్పశ్రీవాణి ఉండేవారు)
అల్లూరి సీతారామరాజు – కోటగుళ్ల భాగ్యలక్ష్మి
ప్రకాశం – జంకె వెంకట రెడ్డి (కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ ను తప్పించారు)
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
కర్నూలు – బీవై రామయ్య (మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉండేవారు)
నంద్యాల – కాటసాని రాంభూపాల్ రెడ్డి
అనంతపురం – పైలా నరసింహయ్య
శ్రీ సత్యసాయి జిల్లా – శంకరనారాయణ
వైఎస్ఆర్ కడప – కొట్టమద్ది సురేష్ బాబు
అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి
చిత్తూరు – నారాయణస్వామి
తిరుపతి – నెదురుమల్లి రామ్ కుమర్ రెడ్డి
వైయస్సార్సీపి రీజనల్ కోఆర్డినేటర్స్ :- మంత్రి బొత్స సత్యనారాయణ (శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు)
శ్రీ వైవి సుబ్బారెడ్డి (విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి).
శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు శ్రీ పివి మిథున్ రెడ్డి (కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు)
శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి & శ్రీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి (కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు)
శ్రీ బీద మస్తాన్ రావు & శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి (పల్నాడు, బాపట్ల, ప్రకాశం)
శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి (నెల్లూరు, తిరుపతి, కడప)
శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (అన్నమయ్య, చిత్తూర్, అనంతపురం, శ్రీ సత్య సాయి)
శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (కర్నూల్, నంద్యాల).. వీళ్ళని పార్టీ అధిష్టానం రీజినల్ కోఆర్డినేటర్ లుగా నియమించడం జరిగింది.