Categories: NewsTrending

Veg Rice : 6 రకాల వెజ్ రైస్ రెసిపీస్.. ఈజీగా తయారు చేసుకోండి ఇలా!!

Veg Rice : మనం ప్రతిరోజు ఒకటే వెరైటీ రైస్ వండుకొని దానిలోకి రోజు ఏదో ఒక కూర చేసుకుని తింటూ ఉంటాం. కానీ మనకి అప్పుడప్పుడు ఏదో ఒకటి వెరైటీ చేయాలి. నోటికి రుచిగా తినాలి. అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎక్కువగా చికెన్ బిర్యాని, ఎగ్ పలావ్, మటన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మనం వెజ్ తో ఆరు రకాలుగా రైస్ రెసిపీస్ చేసి చూపిద్దాం ఇలా…
1 టమాటా రైస్ : దీనికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, ఉల్లిపాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కరివేపాకు, నూనె, నెయ్యి ,ఉప్పు ,పచ్చిమిర్చి, కొత్తిమీర మొదలగునవి. దీని తయారీ విధానం: ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పైన ఒక  బాండీ  పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్, రెండు స్పూన్ల నెయ్యి  ను వేసి తర్వాత దానిలో ముందుగా ఒకటి దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు లవంగాలు వేసి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఆఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఒక కప్పు టమాటా ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని దాన్లో వేసి కొద్దిసేపు తిప్పాలి. తరువాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని దాన్లో రుచికి సరిపడా ఉప్పును వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకొని దింపి వేయాలి. అంతే టమాటా రైస్ రెడీ.

Make 6 Veg Rice Recipes Very Easy Like this

2 పుదీనా రైస్ : దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉడికించుకున్న రైస్ రెండు కప్పులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ  పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్, రెండు స్పూన్ల నెయ్యి, వేసుకొని దానిలో కొద్దిగా జీడిపప్పు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, నాలుగు ఎండుమిర్చి, రెండు లవంగాలు, రెండు యాలకులు, ఒకటి దాల్చిన చెక్క వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అర కప్పు ఉల్లిపాయలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు పుదీనాను తీసుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానిని స్టవ్ పై ఉన్న మిశ్రమంలో వేయాలి. వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం మసాలా, కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ను దానిలో వేసి కలుపుకోవాలి. అంతే పుదీనా రైస్ రెడీ.
3 ఆనియన్ రైస్ : దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఉడికించిన రైస్ ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి, పావు కేజీ ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత దాన్లో 4 పచ్చిమిర్చి చీలికలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు ,అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టిన రైస్ ను తీసుకొని దానిలో వేసి కలుపుకోవాలి. అంతే ఆనియన్ రైస్ రెడీ.
4 జీరా రైస్ : దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ ను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పైన ఒక బాండి పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని, రెండు స్పూన్ల జీలకర్ర వేసి, ఆరు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని కొంచెం కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ను తీసుకొని దీనిలో వేసి కొద్దిసేపు తిప్పి తర్వాత ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్లు పోసి  దానిలో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అన్నం ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే జీరా రైస్ రెడీ.
5 క్యారెట్ రైస్ : దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉడికించుకున్న రైస్ ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నాలుగు క్యారెట్లు తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక బాండీ పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు లవంగాలు, రెండు యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలను వేసి, ఒక స్పూన్ జీలకర్ర వేసి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. దీనిని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న రైస్ ను దీనిలో వేసి కొంచెం ఉప్పును వేసి కలుపుకోవాలి. అంతే క్యారెట్ రైస్ రెడీ.
6 టమాటా మసాలా రైస్ : దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను తీసుకొని మిక్సీ వేసి దానిని కూడా పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని, తర్వాత దానిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వేసి వేయించుకోవాలి. తర్వాత దీనిలో అర స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకొని దీనిలో వేసి రుచికి సరిపోయేంత ఉప్పుకూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే టమాటా మసాలా రైస్ రెడీ. ఇవన్నీ రైతాతో తింటే చాలా బాగుంటాయి.
Share

Recent Posts

Bala Ramayanam : బాల రామాయ‌ణం సీత‌మ్మ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా దిగ‌దుడుపే..!

Bala Ramayanam : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాకముందే, బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన సంగతి…

45 minutes ago

Katari Eswar : గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర కలయిక.. వీడియో !

Katari Eswar : గుడివాడలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్న తరుణంలో, మాజీ మంత్రులు కొడాలి నాని మరియు కటారి ఈశ్వర్…

2 hours ago

ATM Cash : డోంట్ వ‌ర్రీ.. డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి న‌గ‌దు విత్ డ్రా చేసే సౌక‌ర్యం గురించి మీకు తెలుసా?

ATM Cash : డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు ఆర్బీఐ కల్పిస్తోంది. నగదు…

3 hours ago

Dengue Vaccine : ప్రజలకు గుడ్ న్యూస్… ప్రమాదకరమైన డెంగ్యూకి వ్యాక్సిన్ వచ్చేసింది…!

engue Vaccine : వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువే.…

4 hours ago

Razakar Villain : ర‌జాకార్ సినిమా విల‌న్ ఇంత అందంగా ఉంది…ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ కూడా..!

Razakar Villain : రజాకార్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన…

5 hours ago

500 Note Ban : ఏంటి.. రూ.500 నోట్ల‌ని కూడా ర‌ద్దు చేయబోతున్నారా..?

500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…

6 hours ago

Local Body Elections : బ్రేకింగ్‌.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!

Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…

7 hours ago

AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…

8 hours ago