Meal Maker Manchuria : మంచూరియా అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఎక్కువగా బయట రెస్టారెంట్లో తింటూ ఉంటారు. మంచూరియా అంటే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వెజ్ మంచూరియా, ఇంకొకటి చికెన్ మంచూరియా. వెజ్ మంచూరియా అంటే కూరగాయలు అన్నిటితో కలిపి చేస్తుంటారు. చికెన్ మంచూరియా అంటే నాన్ వెజ్ తో చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అవి ఏమీ కాకుండా మీల్ మేకర్ మంచూరియా చేసుకోవడం ఎలాగో చూద్దాం…
దీనికి కావాల్సిన పదార్థాలు : మంచూరియా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సోయాసాస్, రెడ్ చిల్లి సాస్, టమాటా కెచప్, వెనిగర్, క్యాప్సికం, కారం, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పెప్పర్ పౌడర్, కొత్తిమీర మొదలైనవి. దీని తయారీ విధానం : ముందుగా 100 గ్రాముల మీల్ మేకర్ ను తీసుకొని వాటిని నీటిలో వేసి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత వాటిని తీసి ఒక స్ట్రైనర్ లో వేసి తర్వాత వాటిని పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా నీటిని వెయ్యకుండా కలుపుకోవాలి. తరువాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూను వెల్లుల్లి సన్నగా తరిగినవి, అల్లం సన్నగా తరిగినవి రెండు స్పూన్లు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత దీనిలో రెడ్ చిల్లి సాస్, కొంచెం సోయాసాస్, తర్వాత టమాటా కెచప్, కొంచెం వెనిగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకొని నీటిలో కలుపుకొని ఆ నీటిని దీనిలో వేయాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ ను దీనిలో వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత దీనిపై కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా మీల్ మేకర్ తో మంచూరియా రెడీ.
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.