Mutton Paya : మటన్ పాయను ఇలా చేసి చూడండి… ఎంతో రుచిగా ఉంటుంది…

Advertisement

Mutton Paya : మటన్ లో మాంసకృత్తులు బాగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు మటన్ ను తప్పనిసరిగా తినాలి. మటన్ లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. ముఖ్యంగా మేక కాళ్ళను కూర చేసుకుని తింటే శరీరానికి కాల్షియం బాగా అందుతుంది. మేక కాళ్లలో క్యాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేక కాళ్లతో మటన్ పాయను ఇలా చేశారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అసలు మటన్ తినని వారు కూడా ఈ మటన్ పాయను తినేస్తారు. అయితే ఇప్పుడు ఈ మటన్ పాయను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కావలసిన పదార్థాలు: 1) మేక కాళ్లు 2) ఉల్లిపాయ 3) పచ్చిమిర్చి 4) పసుపు 5) ఉప్పు 6) ధనియాలు 7) లవంగాలు 8) దాల్చిన చెక్క 9) యాలకులు 10) జీలకర్ర 11) ఆయిల్ 12) బిర్యానీ ఆకు 13) అల్లం పేస్ట్ 14)టమాట 15) కారం 16) కొబ్బరి పొడి 17)కొత్తిమీర తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు మేక కాళ్ల మాంసాన్ని తీసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, కొంచెం నీళ్లు చల్లి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ లోకి 10, 12 మిరియాలు, ఐదు ఆరు లవంగాలు, మూడు లేక నాలుగు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు యాలకులు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

Advertisement
Making of Mutton Paya Recipe In Telugu
Making of Mutton Paya Recipe In Telugu

తర్వాత అదే మిక్సీ జార్ లోకి ఒక కప్పు ఉల్లిపాయలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ ను వేసి కాస్త వేడి అయ్యాక ఒక బిర్యానీ ఆకును, ఉల్లిపాయ పేస్టును వేసి వేయించుకోవాలి. తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముప్పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాళ్ళను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూడు స్పూన్ల కారం, కొద్దిగా మసాలా, రెండు స్పూన్ల కొబ్బరి పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టిఏడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ కూర రెడీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో చూడండి.

Advertisement
Advertisement