Home » Exclusive » Making Of Tasty Crispy Prawns Curry In Telugu
Exclusive

Prawns Curry : రొయ్యల కూర ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు… అంత టేస్టీగా ఉంటుంది..

Authored By
aruna
The Telugu News | Updated on: September 25, 2022 6:25 pm
Advertisement

Prawns Curry : మనం ఎక్కువగా చేపలు, చికెన్, మటన్, వండుకొని తింటూ ఉంటాం.. కానీ ఎంతో రుచికరమైన రొయ్యలు మాత్రం అప్పుడప్పుడు వండుకొని తింటుంటామ్. అయితే ఆ రొయ్యలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి. అటువంటి రొయ్యలు పులుసుని ఇప్పుడు ఇలా చేసి చూడండి. మళ్లీ మళ్లీ అదే విధంగా చేయమని అడుగుతారు. కావలసిన పదార్థాలు : రొయ్యలు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, కరివేపాకు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి…

Advertisement

తయారీ విధానం : ముందుగా శుభ్రం చేసిన రొయ్యల్ని తీసుకొని మరొకసారి పసుపు, నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు 4 యాలకులు, కొంచెం జీలకర్ర ,లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, కొంచెం మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి.

Making Of Tasty Crispy Prawns Curry In Telugu

Advertisement

తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నా రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలి . తర్వాత దానిలో టమాట ముక్కల్ని వేసి ఆయిల్ సపరేటు అయ్యేవరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, వేసి బాగా కలుపుకొని తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, వేసి కలుపుకొని తర్వాత చింతపండు రసాన్ని వేసి దగ్గరకయ్యే వరకు ఉడికించుకొని తర్వాత దానిలో ఒక టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసిన తరువాత ఇక గ్రేవీ దగ్గరకు అయ్యేవరకు ఉడికించుకొని స్టవ్ ఆపి దింపుకోవడం అంతే ఎంతో సింపుల్ గా రొయ్యల పులుసు రెడీ.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి