Health Tips : కొన్ని కూరగాయలను పొట్టు తీసి పడేసి లోపలి పదార్థాన్ని వండుతూ ఉంటారు. అయితే కూరగాయలైన, పప్పు దినుసులైన ఏవైనా సరే తొక్కలో ఉండే పోషక విలువలు అందరికీ తెలిస్తే వాటిని పడేయరు. అలాగే ఇప్పుడు ఆలుగడ్డ దానిని కూడా తొక్క తీసే వండుతూ ఉంటాం. ఆలుగడ్డ మట్టిలో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి దానికి మొత్తం మట్టి ఉంటుంది. ఆ మట్టి కారణంగా దాని తొక్కని తీసి కుక్ చేస్తూ ఉంటారు. అయితే అలా తీసేయడం వలన ఎన్ని నష్టాలు మీకు తెలుసా.. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు ఆ పొట్టు లోంచి పోతాయో కూడా మీకు తెలిసి ఉండదు.. ఆ పోషిక విలువలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1) ఈ ఆలుగడ్డలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు, గ్లైకో ఆల్కలాయిడ్స్, పాళీ పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లోని కొలెస్ట్రాన్ని కంట్రోల్ చేస్తాయి. 2) బంగాళదుంప తొక్కలోని విటమిన్ సి అధికంగా ఉంటుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్, కాలుష్యం విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కావున ఆలుగడ్డ తొక్క తీసి వండుకోవడం కంటే తొక్కతోనే వండుకోవడం మంచిది. 3) ఆలుగడ్డలు తొక్కతో తీసుకోవడం వలన గుండెపోటు లాంటివి వచ్చి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 4) ఈ తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్పరస్, రాగి, జింకు, క్యాల్షియం, పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అందవలసిన ముఖ్యమైన పోషకాలు.
5) ఈ బంగాళదుంప అందానికి కూడా దీని తొక్కలు చాలా సహాయపడతాయి. దీనిలో ఫినాలేక్, ఆంటీ యాక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ తొక్కలు మొటిమలు మచ్చలున్న చోట రుద్దితే మంచి బ్లీచ్ల పని చేస్తాయి. 6) ఆలుగడ్డ తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు స్ట్రాంగ్ గా ఎదుగుతుంది. అదేవిధంగా జుట్టు మెరుస్తుంది. వాస్తవానికి ఆలుగడ్డ వేపుడు లాంటివి తొక్కతో కలిపి చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. కూర ముద్దవ్వకుండా బావుంటుంది. ఆలుగడ్డ తొక్కలను ఎక్కువ మట్టి ,మురికి ఉంది. అనుకుంటే నీటిలో ఒక పావుగంట నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేస్తే అదంతా తొలిగిపోతుంది. 7) ఆలుగడ్డ తొక్కలు పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ ఆలుగడ్డ క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.