Rats : అరటిపండును చూసి భయపడుతున్న మగ ఎలుకలు.. ఎందుకో తెలిస్తే షాక్
Rats: ఎలుకలు కొన్ని సార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. వాటి ప్రవర్తన చూసి ఒక్కోసారి షాక్ అవుతుంటాం. కానీ అవి ఎందుకు అలా చేస్తున్నాయో మాత్రం అర్థం కాదు. అయితే ఎలుకలు ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు, పప్పులు, ఫ్రూట్స్, కూరగాయలు తింటుండటం చూసుంటా. అయితే ఎలుకలు అరటి పండును చూస్తూ మాత్రంల భయంతో పరుగెడతాయంట. ఇదే విషయాన్ని ఓ ప్రయోగం ద్వారా శాస్త్రజ్ఞులు నిరూపించారు. గర్భిణీ, బాలింత ఎలుకల దగ్గర ఉన్న మగ ఎలుకలలో ఒత్తిడి, హార్మోన్ల పెరుగుదలను తెలుసుకోవడానికి క్యూబెక్ లో మాంట్రియల్ లోని మెక్ గిల్ యూనివర్సిటీ స్కాలర్స్ ప్రయత్నించగా ఈ విషయం తెలిసింది.
మగ ఎలుకల్లో ఆర్మోన్లలో మార్పులు, ఆడ ఎలుకల మూత్రంలో ఎన్-పెంటిల్ అసిటెట్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఈ ఫలితం వచ్చినట్లు వారు వెల్లడించారు. కాగా ఇదే సమ్మెళనం అరటిపండ్లకు కూడా ఉందని అందుకే ప్రత్యేక మైన వాసనను ఇస్తుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇదే విషయాన్ని మే 20న సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో పబ్లిష్ చేశారు.గర్భిణీ ఎలుకల్ని ఓ ప్రయోగం కోసం ల్యాబ్ లో ఉంచగా వాటి దగ్గరున్న మగ ఎలుకలు విచిత్రంగా ప్రవర్తించాయని తెలిపారు.
Rats : అరటిపండు నూనెతో..
మగ ఎలుకలు తమ జన్యుపరమైన సమర్థ్యాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి శిశుహత్యల్లో దూకుడుగా ప్రవర్తిస్తాయంట. అందుకే ఆడ ఎలుకలు తమ సంతానాన్ని కాపాడుకోవటానికి కెమోసిగ్నలింగ్ పై ఆధారపడి శరీరాల ద్వారా రసాయన ప్రతిస్పందనలు విడుదల చేస్తాయని వెల్లడైంది. అందుకే పరిశోధకులు అరటిపండు నూనెను తీసుకుని దూది బాల్స్ లలో వేసి మగ ఎలుకల బోనులో ఉంచగా ఒత్తిడి స్థాయిని పెంచినట్లు గుర్తించారు.