Malla Reddy : విశాఖ ఉక్కును కాపాడేది కేసీఆర్ ఒక్కడే అంటూ తెలంగాణ మంత్రి కామెంట్స్ వీడియో వైరల్…!!
Malla Reddy : గత కొద్ది రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో అధికారంలో ఉన్న BRS పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమితి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో.. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇటీవల చాలా సందర్భాలలో మల్లారెడ్డి వైసీపీ పార్టీనీ టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నరు. ఎక్కడ మీటింగ్ పెట్టిన… మీడియా సమావేశాలు నిర్వహించిన…వైసీపీ గురించే ఎక్కువ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే కార్మిక దినోత్సవం నాడు మే మొదటి తారీకు రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కార్మికుల గురించి మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
కాపు, కమ్మ, రెడ్డి అంటూ రాజకీయాలు చేస్తు్న్నారే తప్ప జనాలను, సమస్యలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేది కేసీఆరే అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం ఎవరి తరం కాదని కేసీఆర్ మాత్రమే ఆదుకోగలరని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌నే ఏపీ ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విశాఖలో లక్ష మందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు.