Mamata Banerjee : షాక్ లకే షాక్ ఇది : మోడీ PM పీఠాన్ని కూల్చబోతోన్న మమతా బెనర్జీ !

Authored By Himanshi | The Telugu News | Published on: May 6, 2021, 8:30 pm

Mamata Banerjee: దేశంలో బీజేపీకి ఎదురు లేదు.. మోడీ మరియు అమిత్ షా ల జోడీకి తిరుగు లేదు అంటూ బలంగా అంతా నమ్ముతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మోడీ మరియు అమిత్ షా ల ద్వజంకు మమత బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ లో తిరుగులేని విజయంను దక్కించుకుని దాదాపు ఏడు ఏళ్ల తర్వాత మోడీకి షాక్ ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా వారికి ఎలాంటి పోటీ లేకుండా ఉంది. కాని మమత బెనర్జీ వారిని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పశ్చిమ బెంగాల్ విజయంతో ఆమె గురించి అంతా అనుకుంటున్నారు.

ప్రత్యామ్నాయ శక్తి..

mamata banerjee is going to brake pm post

mamata banerjee is going to brake pm post

దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అనేది ఖచ్చితంగా మమత అంటూ ఇప్పుడు అంతా బలంగా నమ్ముతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్న సమయంలో మమత టీఎంసీ పార్టీ మాత్రం అద్బుతంగా దూసుకు పోతుంది. పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ప్రభావం చూపించబోతుంది అంటూ ఈ ఎన్నికల ఫలితాలతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. దేశ వ్యాప్తంగా కూడా టీఎంసీ ముందు ముందు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కొందరు నాయకులు బలంగా నమ్ముతున్నారు.

Mamata Banerjee : కాంగ్రెస్‌ స్థానం భర్తీ…

దేశంలో ప్రధాన ప్రతిపక్షం పాత్రను కాంగ్రెస్‌ పోషించాల్సి ఉంది. కాని ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో కూడా ఢీ లా పడిపోయింది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్‌ గెలువ లేక పోయింది. దాంతో దేశ వ్యప్తంగా కూడా కాంగ్రెస్‌ పని అయిపోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో టీఎంసీ ఖచ్చితంగా కాంగ్రెస్ స్థానంను భర్త చేయాల్సిన సమయం వచ్చిందని దేశ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తో టీఎంసీ కలిస్తే ఖచ్చితంగా మోడీని పీఎం సీటు నుండి దించడం ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ కు ఆ దమ్ము లేకున్నా మమతకు ఆ దమ్ము ఉన్నట్లుగా విశ్లేషకులు నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అద్బుతం జరగడం ఖాయంగా చెబుతున్నారు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp