Home » News » Man Flees With Money Garland From Wedding Groom Chase
News

Groom Chase : సినిమాను త‌లిపించేలా చేజ్‌.. డ‌బ్బుల దండ‌ కోసం స్వ‌యంగా పెండ్లి కొడుకే రంగంలోకి

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 25, 2024, 5:00 pm
Advertisement

Groom Chase : అచ్చం సినిమాలో జ‌రిగిన చేజ్ సీన్ విధంగా బ‌య‌ట ఓ సంఘ‌టన జ‌రిగింది. విల‌న్ పారిపోతుంటే హిరో చేజ్ చేసి ప‌ట్టుకున్న‌ట్టుగానే ఇక్క‌డా జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వ‌రుడు త‌న వివాహ వేడుక‌లో ఉన్నాడు. వ‌రుడు బూడిద రంగు సూట్‌, ఎర్ర‌టి త‌ల‌పాగా ధ‌రించి మెడ‌లో డ‌బ్బుల దండ‌తో హైవేలో గుర్రంపై ఊరేగుతున్నాడు. ఇది వారి సాంప్ర‌దాయం. అదే స‌మయంలో మినీ ట్ర‌క్కులో ఆ మార్గం గుండా ప్ర‌యాణిస్తున్న డ్రైవ‌ర్ వ‌రుడి మెడ‌లోని డ‌బ్బుల దండ‌ను లాక్కొని వెళ్లిపోయాడు.

Advertisement

Groom Chase : సినిమాను త‌లిపించేలా చేజ్‌.. డ‌బ్బుల దండ‌ కోసం స్వ‌యంగా పెండ్లి కొడుకే రంగంలోకి

వెంట‌నే వ‌రుడు అటుగా వెళ్తున్నబైక‌ర్‌ను ఆపి హైవేపై ట్ర‌క్కును చేజ్ చేశాడు. అయితే ఏం జరుగుతుందో డ్రైవర్ ఊహించ‌లేదు. వ‌రుడు ట్ర‌క్కును చేజ్ చేసి ప‌ట్టుకుని ఎక్కాడు. గ్లాస్ విండో నుంచి లోప‌లికి దూరాడు. ఈ సాహ‌సోపేత‌మైన సీన్ అచ్చం సినిమా సీన్‌నే త‌ల‌పించింది.

Advertisement

వరుడు డ్రైవర్‌ను వాహనం నుండి బయటకు లాగి, పెళ్లి వేడుకకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కొట్టాడు. బైక్‌పై సిలిండర్లు తీసుకెళ్తున్న మరో వ్యక్తి కూడా డ్రైవర్‌ను ఢీకొట్టాడు. త‌ట్టుకోలేని డ్రైవ‌ర్ తనకు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం లేదని, త‌న‌ను మ‌న్నించ‌మ‌ని వేడుకున్నాడు. వైరల్‌గా మారిన ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్ల‌డించారు. Money Garland, Wedding. Groom, Uttar Pradesh, Meerut

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి