Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ గొడవలు... స్టేజ్‌పై నుండే నిర్మాతలకి చురకలు అంటించిన దేవి శ్రీ
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేయడం మనం చూశాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైపోయింది. సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విడదీయలేని బంధం వారిది. దేవి లేకపోతే సినిమా చేయలేను.. అని సుకుమారే చాలా వేదికలపై చెప్పాడు. పుష్ప-2 బాగ్రౌండ్ స్కోర్ కోసం దేవిని పక్కన పెట్టి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శ్యామ్ సీఎస్‌లను తీసుకొచ్చారు మైత్రీ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సమయానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గుర్ని తీసుకోవాల్సి వచ్చిందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ గొడవలు… స్టేజ్‌పై నుండే నిర్మాతలకి చురకలు అంటించిన దేవి శ్రీ
ఈ నేపధ్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఓపెన్ అయ్యారు.’మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాత ఇచ్చే పారితోషికమైనా, తెరపై మన పనైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చాలా మంది హీరోయిన్స్ డ్యాన్స్ చేసిన తొలి స్పెషల్ సాంగ్‌కు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ క్రెడిట్ ఏ సంగీత దర్శకుడికీ లేదు’ అని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిని సంబోధిస్తూ .. ‘నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే .. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు. టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు. టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటారు.
మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటో అర్ధం కాదు. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20 – 25 నిమిషాలు అవుతుంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను ఆపారు. లోపలికి వెళ్తాను అంటే నన్ను లోపలికి పంపించలేదు. చివరకు కిస్సక్ పాట విని లోపలికి పరిగెత్తుకొచ్చాను. వచ్చినోడిని ‘రాంగ్ టైమింగ్ సార్ లేట్‌గా వచ్చారు’ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేను ఎప్పుడూ అన్ టైమ్ సర్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. నిర్మాతలతో ఎంతైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ ఇలా బహిరంగంగా వేదికపై దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.