Pig Heart Transplantation : మనిషికి పంది గుండెను అమర్చిన వైద్యులు.. ఆపరేషన్ అయిన రెండు నెలలకు వ్యక్తి మృతి
Pig Heart Transplantation : చరిత్రలోనే తొలిసారి పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చారు. ఈ ఘటన రెండు నెలల కింద యూఎస్ లో చోటు చేసుకుంది. కానీ.. పంది గుండెను అమర్చిన రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి మృతి చెందాడు. డేవిడ్ బెన్నెట్ అనే 57 ఏళ్ల వ్యక్తి చాలాకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స కోసం డేవిడ్.. మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరాడు.అతడిని చెక్ చేసిన వైద్యులు అతడి గుండె సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో అతడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని భావించారు. దాత కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దొరకలేదు.
రోజురోజుకూ అతడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఏం చేయాలో తెలియని వైద్యులు.. చివరకు అతడికి పంది గుండెను అమర్చాలని అనుకున్నారు.ఒకవేళ లేట్ అయితే.. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని.. వెంటనే పంది గుండెను అతడికి అమర్చారు. ఈ ఆపరేషన్ జనవరి 7, 2022న నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో డాక్టర్లు అందరూ సంతోషించారు.రెవివికార్ అనే ఓ కంపెనీ పంది గుండెను ఆ పేషెంట్ కు దానం చేయడంతో డాక్టర్లు పంది గుండెను అతడికి అమర్చారు. సర్జరీ విజయవంతం కావడంతో.. చరిత్రలోనే ఇది రికార్డు అయి ప్రపంచమంతా షాక్ అయింది. భవిష్యత్తులో అవయవాల కొరత ఏర్పడితే..
Pig Heart Transplantation : రీజనరేటివ్ మెడిసిన్ విధానం ద్వారా పంది గుండెను దానం చేసిన కంపెనీ
జంతువుల నుంచి కూడా అవయవాలు తీసుకొని మనిషికి అమర్చవచ్చని అందరూ అనుకున్నారు.కానీ.. సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులకే అతడి ఆరోగ్యం క్షిణించిందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఆ తర్వాత రెండు నెలల్లోనే ఆ వ్యక్తి మరణించినట్టు ఆసుపత్రి ప్రకటించింది.డేవిడ్ కు పంది గుండె అమర్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. కొన్ని వారాల వరకు ఆయన ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు కానీ.. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో ఆ పేషెంట్ బతికే అవకాశాలు సన్నగిల్లాయని మాకు అనిపించింది. జీవితంతో అతడు ఎంతో పోరాడాడు. కానీ.. చివరకు ఓడిపోయాడు.. అని మేరీలాండ్ ఆసుపత్రి ప్రకటించింది.