Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్
ప్రధానాంశాలు:
Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇటీవలే థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ప్రమోషన్స్ సమయంలోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ, విడుదల తర్వాత వాటిని నిజం చేస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ అయింది. దాదాపు అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండగా, వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్
Mana Shankara Vara Prasad Garu Movie : సంక్రాంతి బ్లాక్ బస్టర్
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ డామినేషన్ కొనసాగుతోంది. బుక్ మై షోలో ఇప్పటివరకు ఈ సినిమాకు 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇది ప్రేక్షకుల ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.మేకర్స్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే రూ.84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడో రోజుకు రూ.150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ చిత్రం, నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. తాజాగా ఐదు రోజుల వసూళ్లను ప్రకటించిన మేకర్స్, ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. ఒక రీజినల్ మూవీకి ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని చెబుతూ, ఈ ఘనతను తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
“ప్రతి చోటా డామినేట్ చేస్తూ దూసుకుపోతున్న మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ MSG, 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక రీజినల్ మూవీకి ఇది ఆల్‌టైమ్ రికార్డ్. సెన్సేషనల్ వీకెండ్ అంతా MSGదే” అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.ఇదిలా ఉండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ చిత్రానికి వరల్డ్‌వైడ్‌గా రూ.140-150 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.280 నుంచి రూ.300 కోట్ల గ్రాస్ అవసరమని పేర్కొనగా, ఇప్పటికే సినిమా ఆ దిశగా వేగంగా దూసుకుపోతోంది.