Chandrababu : మ్యానిఫెస్టోతో తన కంట్లో తానే పొడుచుకున్న చంద్రబాబు..!
Chandrababu : ప్రస్తుతం ఏపీలో ఒకే ఒక చర్చ నడుస్తోంది. అదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టో. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను చూసి ముందు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాలనలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలతో పోల్చి చూశారు. అవన్నీ అచ్చు గుద్దినట్టు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను విమర్శించిన అదే చంద్రబాబు.. ఇప్పుడు అవే పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. అయితే.. టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ ప్రజల్లోనే కాదు..
టీడీపీ నేతలకు కూడా నమ్మకం లేదు. వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఎందుకు ఇలాంటి మేనిఫెస్టోను ఇప్పుడే తీసుకొచ్చారు అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అసలు ఈ మేనిఫెస్టో టీడీపీకే మైనస్ పాయింట్ లా మారింది. ఈ మేనిఫెస్టో వల్ల టీడీపీకి పెద్ద బొక్కే కానీ.. వచ్చే లాభం అయితే ఏం ఉండదు అని అంటున్నారు. చంద్రబాబు.. సీఎం జగన్ ట్రాప్ లో పడ్డారా? మరోసారి రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధమయ్యారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మేము అధికారంలోకి వస్తే సీఎం జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారు.
Chandrababu : మేము అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండింతలు సంక్షేమ పథకాలు
అదే చంద్రబాబు ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మరో పాకిస్థాన్, మరో శ్రీలంక, మరో వెనుజులా చేస్తున్నారా. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడమేనా.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరా? కూర్చొని తినేవాళ్లకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతున్నారా? అంటూ చంద్రబాబు మండిపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరి ఆయన చేసిందేంటి.. అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు 2014 లో ఇచ్చిన హామీలను ఆ తర్వాత చంద్రబాబు అమలు చేశారా? ఇప్పుడు మళ్లీ గెలిచి వీటిని అమలు చేస్తారనే నమ్మకం ఏంటి అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూద్దాం మరి.. ఇంకా ఎన్ని హామీలను చంద్రబాబు గుప్పిస్తారో?