One Rupee Marriage : ఒక్క రూపాయి ఖర్చుతో వివాహం… వాళ్లకు వరం… ఎక్కడో తెలుసా..?
ప్రధానాంశాలు:
One Rupee Marriage : ఒక్క రూపాయి ఖర్చుతో వివాహం... వాళ్లకు వరం... ఎక్కడో తెలుసా..?
One Rupee Marriage : జీవితంలో ఒకేసారి జరుపుకునే వేడుక పెళ్లి. వివాహం అనేది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. ఇక పెళ్లి వేడుక జరపడానికి కొందరు లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ఇంకొందరు కోట్లల్లో ఖర్చు చేస్తూ ఉంటారు.. మ్యాచ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి పెళ్లి అయ్యి 16 రోజుల వరకు ఏదో ఒక రూపంలో ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఇలా ఎంతో ఖర్చు చేసి పెళ్లి చేస్తూ ఉంటాం. కానీ కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో పెళ్లి అని న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు దీని స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం.. అసలు ఖర్చే లేకుండా పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.
అయితే ఒక్క రూపాయి ఖర్చుతో పెళ్లి పూర్తయ్యే అవకాశం కల్పిస్తోంది రూపాయి ఫౌండేషన్.. అయితే ఈ వరం కేవలం దివ్యాంగలకి మాత్రమే నట. అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు అనిల్ కుమార్ నాగమల్ల ,అరుణ ఈ మధ్యకాలంలో రూపాయి ఫౌండేషన్ పేరుతో సేవా సంస్థను మొదలుపెట్టారు. ఈ సమస్త ద్వారా ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగలకి పెళ్లి చేస్తామని చెప్తున్నారు. దివ్యాంగల జీవితాలలో వెలుగులు నింపడానికి ఈ కార్యక్రమాన్ని స్థాపించినట్లు వాళ్లు తెలిపారు. వారి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగ ల జంటకు ఫ్రీగా వివాహం చేస్తామని వారు తెలిపారు.
రూపాయి ఫౌండేషన్ తీసుకున్న నిర్ణయం దివ్యాంగలకు అదృష్టంగా మారింది. గత 15 సంవత్సరాలుగా 100కు పైగా అనాధలకు దివ్యాంగ జంటలకు పెళ్లిళ్లు జరిపించింది. అమ్మ పౌండేషన్ ప్రస్తుతం రూపాయి ఫౌండేషన్ తో ఒక్క రూపాయి ఖర్చుతోనే వివాహ వేడుకను జరిపిస్తున్నారు. అయితే సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్ కు చెందిన మట్ట రమేష్ తో సైదాబాద్ లో ఈరోజు పెళ్లి జరిపించారు. ఇటువంటి పెళ్లిళ్ల కోసం ఆర్థిక చేయూతనించేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలను అందివ్వాలని అమ్మ ఫౌండేషన్ వారు కోరుకుంటున్నారు. మీరు చేసే సాయం ఎంతోమంది అనాధలకు, దివ్యాంగులు కు ఉపయోగపడుతుందని సాయం చేయాలి అనుకున్నవారు దాతలు మా ఫౌండేషన్ కొచ్చి సాయాన్ని అందించవచ్చు అని వారు తెలిపారు..