Home » News » Marriage Viral News On Social Media
News

viral News : అయ్యో పాపం ..!! ఈ వధూవరులకు పెళ్లిరోజే ఇలా జరిగింది ఏంటి .. బంధువులంతా షాక్ ..!!

Authored By
aruna
The Telugu News | Published on: September 28, 2023, 3:00 pm
Advertisement

Viral News : ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం వివాహం. ఆ వివాహాన్ని ఎప్పటికీ మరుపు రానిదిగా, వీలైనంత గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటారు. మరీ ఇప్పుడు పెళ్లిలను చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అప్పు చేసి మరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ వరకు అన్ని గ్రాండ్ గా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్ల వలన పెళ్లిలో అపశృతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఈ వీడియోలో పెళ్లి ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి మండపం మీదకు వధూవరులు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. మండపం వెనుక ఉన్న క్రేన్ సహాయంతో వధూవరులను వేదిక మీదకు దించుతున్నారు. స్పెషల్ గా ఫైర్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఒక తప్పు జరిగిపోయింది. క్రేన్ కు కట్టిన తాడు తెగిపోవడంతో వధూవరులు ఉన్న ట్రాలీ వేగంగా కిందకు పడిపోయింది. దీంతో వధూవరులు ఒక్కసారిగా తలక్రిందులుగా పడిపోయారు. అయితే ఈ సంఘటన మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త ఇలా వైరల్ గా మారింది.

Marriage viral News on social media

Advertisement

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో పాపం .. వధూవరుల పెళ్లిరోజు ఇలా జరిగిందేంటి అని కొందరు, ఈ సంఘటనను వాళ్లు ఎప్పటికీ మరిచిపోరు అని మరి కొందరు, పెళ్లిలో ఇలాంటి ప్రమాదకర సాహసాలు చేయడం అవసరమా అని ఇంకొందరు సీరియస్గా కామెంట్లు చేశారు. ఇంకా నయం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కు ఎటువంటి ప్రమాదం జరగలేదని కొందరు కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి