
Malla Reddy : కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ..!
Malla Reddy : కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సర్వత్ర ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో డిసెంబర్ 3న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. కొన్నేళ్ల నుంచి భారాస పట్ల వ్యతిరేకత కనిపిస్తుండగా ఈసారి ఓట్లతో కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజలు తమ కసిని తీర్చుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇదిలా ఉంటే గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన గులాబీ బాస్ కెసిఆర్ గజ్వేల్ లో విజయకేతనం ఎగురవేయగా, కామారెడ్డిలో ఓటమిని చవి చూశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో విజయం సాధించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది.
అయితే తెలంగాణ భవన్ లో సోమవారం రోజున భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తమ పార్టీ మాజీమంత్రులు గెలిచిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ పై వారితో చర్చించారు. అయితే ఈ సమావేశంలో బీఆర్ఎస్ లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో రిజల్ట్స్ విడుదలై రెండు రోజులు గడవకముందు వారు పార్టీ మారుతున్నారని ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతడి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం నాడు కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. అయితే మల్లారెడ్డి అతడి అల్లుడు కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి .
తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. తనపై రాజకీయ కక్షతోనే కావాలనే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డి హాజరు కాలేదంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నమ్మవద్దని, ఇలాంటి వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆల్వేస్ విత్ కేసీఆర్ అని హ్యాష్ టాగ్ కూడా పెట్టారు. దీంతో మల్లారెడ్డి పై వస్తున్న వార్తలకి చెక్ పడినట్లు అయింది. కానీ భవిష్యత్తులో హస్తం గూటికి మల్లారెడ్డి చేరుతాడా లేదా అనేది చూడాలి.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.