Ram Charn : రామ్ చరణ్‌ని తొలిసారి స్క్రీన్‌పై చూసి క్లింకార అదిరిపోయే రియాక్షన్
ప్రధానాంశాలు:
Ram Charn : రామ్ చరణ్‌ని తొలిసారి స్క్రీన్‌పై చూసి క్లింకార అదిరిపోయే రియాక్షన్
Ram Charn : మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. ఇక 2012 లో చరణ్.. ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తరువాత చరణ్ లక్ మారిపోయింది. ఉపాసన.. మెగా కోడలుగా, మంచి భార్యగా, అపోలో అధినేతగా అన్ని చక్కదిద్దితూ మంచి పేరు తెచ్చుకుంది.
Ram Charn తండ్రిపై ప్రేమ
ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకి క్లింకార అనే చిన్నారి జన్మించింది. ఆ చిన్నారి ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో టీవీలో చూసింది . టీవీలో తండ్రిని చూసి అల్లరి చేసింది. ఆ వీడియో చూసి చెయ్యి కూడా ఊపింది. ఈ వీడియోను ఉపాసన కొణిదెల ఎక్స్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది ఉపాసన. ఇక ఈ వీడియోను షేర్ చేసి క్లీంకార మొదటిసారి టీవీలో తన నాన్నను చూసి ఎగ్జైట్ అయింది.
నాకు ఎంత గర్వంగా ఉంది గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నా అని పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెట్టిజెన్లు క్లీంకార ఎంత క్యూట్‌గా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. వీడియోలో క్లీంకార తండ్రిని మొదటిసారిగా స్క్రీన్ పై చూసి సంతోషంగా కేకలు వేస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియోను ఉపాసన ప్రదర్శించడంతో ఇలా ఆనందంతో అల్లరి చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️@AlwaysRamCharan sooo proud of u.
Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP— Upasana Konidela (@upasanakonidela) January 4, 2025