YS Jagan Craze : మినిస్టర్ అంగనవాడీకి వెళ్తే ఊహించని సంఘటన.. జగన్ క్రేజ్ చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Craze : మినిస్టర్ అంగనవాడీకి వెళ్తే ఊహించని సంఘటన.. జగన్ క్రేజ్ చూడండి !

 Authored By kranthi | The Telugu News | Updated on :9 May 2023,3:00 pm

YS Jagan Craze : ఏపీ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలుసు కదా. ఆయన విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన తాజాగా మాడుగుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికంగా ఉన్న సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సచివాలయంతో పాటు అక్కడే ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఉన్న చిన్నారులతోనూ ఆయన ముచ్చటించారు. అంగన్ వాడీ కేంద్రంలో భోజనం, అల్పాహారం అందుతోందా?

minister budi mutyala naidu goes to government school in ap

minister budi mutyala naidu goes to government school in ap

రుచికరంగా ఉంటోందా అని కేంద్రంలోని చిన్నారులను అడిగారు మంత్రి. మీ ఇంటి కంటే ఇక్కడ బాగుంటుందా అని అడగడంతో పిల్లలు అందరూ అవును.. ఇక్కడే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి చాలా సంతోషించారు. మీకు భోజనం ఎవరు పంపిస్తున్నారు. ఇవన్నీ మీకు ఎలా వస్తున్నాయి అని ప్రశ్నించడంతో జగన్ మామయ్య అంటూ పిల్లలు చెప్పడంతో మంత్రి ఎగిరి గంతేశారు. మరి.. జగన్ మామయ్యను మీరు చూశారా అని మంత్రి అడగడంతో టీవీల్లో చూశాం అని కొందరు చిన్నారులు, మరికొందరు చిన్నారులు అయితే..

ap high court comments on village and ward volunteers

ap high court comments on village and ward volunteers

 

YS Jagan Craze : సీఎం చిత్రపటాన్ని చూపించిన చిన్నారులు

అంగన్ వాడీ కేంద్రంలో ఉన్న సీఎం చిత్రపటాన్ని చూపించారు. దీంతో మంత్రికి పట్టరాని ఆనందం వేసింది. వెంటనే మంత్రి తన దగ్గర ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లను పిల్లలకు పంచి పెట్టారు. ఇవన్నీ జగన్ మామయ్య మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పడంతో పిల్లలు వాటిని తీసుకొని సంతోషంగా తిన్నారు. అలాగే.. అంగన్ వాడీలో పిల్లల సంరక్షణ విషయంపై ఆయాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. చిన్న పిల్లలకు తెలుసు జగన్ ఏం చేస్తున్నారో? కానీ.. విపక్షాలు మాత్రం నోరు నెత్తిన పెట్టుకుంటాయి. పిల్లలకు తెలిసినంతగా కూడా వాళ్లకు తెలియదు అంటూ ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది