ఖర్మ.. నా పేరు మీద గెలిచిన వారంతా నిద్ర పోతున్నారు
ఏపీ మంత్రి Peddireddy Ramachandra Reddy సొంత పార్టీ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రజలుకు సేవ అందించాల్సింది పోయి ఇంట్లో పడుకున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇంటింటికి తిరిగి ఈ సమయంలో జనాల ఆరోగ్యంపై వాకబు చేసి వారికి కావాల్సిన సేవ చేయాల్సింది పోయి ఇంటికే పరిమితం అవుతున్నారు అంటూ ఈ సందర్బంగా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన పేరు మీద గెలిచిన వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యి జనాలను పట్టించుకోక పోవడంపై మంత్రి పెద్దరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందంతా నా ఖర్మ అంటూ తన పార్టీ ప్రజా ప్రతినిధులపై ఆయన కోపం వెళ్లగక్కాడు.
జిల్లా ప్రతినిధులు ఎక్కడ…
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం పరిధిలో ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా ఈ సమయంలో బయట కనిపించడం లేదు. వారికి ఎవరికి కూడా ప్రజల శ్రేయస్సు పట్టినట్లుగా లేదు. నియోజక వర్గంలో తన పేరు చెప్పుకుని తన ఫొటో జగన్ మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిన వారు ఇప్పుడు ప్రజా సేవలో కాకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. వారంతా ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి గెలిచిన వారు కాదు. వారు ఇంట్లో ఉంటే నామినేషన్ పత్రాలు నేను పంపించాను. వారి ఇంటికి నేను వెళ్లి రూపాయి ఖర్చు లేకుండా వారిని గెలిపించాను. కాని వారు మాత్రం ఇప్పుడు ప్రజల బాధలు పట్టకుండా ఉన్నారంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
మంత్రి కోపం కారణం ఏంటీ..
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కోవిడ్ ఆసుపత్రిగా మార్చుతూ జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఆ కారణంగా అక్కడకు మంత్రి వెళ్లారు. ఆ సమయంలో రోగులతో మరియు ఇతర అధికారులతో ఆయన మాట్లాడాడు. ఆ సమయంలో నియోజక వర్గంలోని కొత్త సర్పంచ్ లు, ఎంపీటీసీలు మరియు జెడ్సీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లు ఇలా ఎవరైనా కూడా ప్రజల్లో తిరిగి ఈ సమయంలో ధైర్యం చెప్పడం కాని వారికి కావాల్సినవి అందించడం కాని చేయడం లేదని కొందరు పేర్కన్నారు. దాంతో మంత్రికి కోపం వచ్చి ఇంట్లో తిని కూర్చుంటున్నారా అంటూ ప్రజా ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.