
Minister Roja Comments On Pawan Kalyan
Minister Roja : పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టాక కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క… రాష్ట్రంలో పర్యాటకులు సందర్శించే ప్రదేశాల వివరాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కీ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు 25 దేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వస్తూ ఉండటంతో విశాఖపట్నంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా ఇన్ఫర్మేషన్ పొందుపరచడం
Minister Roja Comments On Pawan Kalyan
జరిగిందని తెలిపారు. దేవాలయాలు ఇంకా బీచ్ లు… లంబసంగి, వనజాంగి ఇంకా పలు ప్రాంతాలు గురించి పర్యాటకులకు తెలుసుకునేలా సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాంతాలు విషయాలు మొత్తం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. దేశంలో అత్యంత తీర ప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. దీంతో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో ఉందని రోజా క్లారిటీ ఇచ్చారు. పర్యాటక రంగం వల్ల హోటల్స్ మరియు ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆనందం కూడా దక్కుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ సోదరుడు నాగబాబు పర్యాటక శాఖ మంత్రిగా రోజాపై సెటైర్లు వేయడం తెలిసిందే. మెగా కుటుంబం పై రోజా చేసిన కామెంట్ల సమయంలో… ఆమె నోరు చెత్త కుండీ అని పర్యాటక రంగంలో ఏపీ 13వ స్థానంలో కిందకెళ్ళిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ముందు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని తెలిపారు. ఇటువంటి క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా సరిగ్గా కౌంటర్ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో 13వ స్థానంలో ఉందని వైసీపీ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
This website uses cookies.