Minister Roja : స్పెషల్ హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి శ్రీదేవి ఫ్యామిలీనీ కాపాడిన వ్యక్తి జగన్ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!!
Minister Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడిందని ఆమెను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం తెలిసిందే. దీంతో తాడికొండ నియోజకవర్గం వదిలి హైదరాబాదులో… ఉంటున్న ఉండవల్లి శ్రీదేవి గత ఆదివారం వైసీపీ అధిష్టానం పై తీవ్ర స్థాయిలో మండిపడింది. కాల్ గర్ల్ మాదిరిగా వాడుకొని వదిలేసారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కరోనా సమయంలో ఉండవల్లి శ్రీదేవి ఆమె భర్త శ్రీధర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా సీఎం జగన్ చొరవ తీసుకున్నారు
Minister Roja Fires on Undavalli Sridevi
అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుటాహుటిన ఉండవల్లి శ్రీదేవి ఫ్యామిలీకి ప్రత్యేకంగా స్పెషల్ హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాదులో చికిత్స కూడా ఇప్పించారని స్పష్టం చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఆమె భర్త ఆరోగ్యం బాగుపడేంతవరకు వైఎస్ జగన్ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. మా అధినేత వైఎస్ జగన్ తన దగ్గరకు వచ్చే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరొచ్చినా చాలా గౌరవప్రదంగా ఉంటారు. నియోజకవర్గ సమస్యలు వివరించిన టైంలో వారి గౌరవం రెట్టింపు అయ్యే రీతిలో స్పందిస్తారు. అదే సమయంలో వారి బాగోగులు తెలుసుకొని… సాయం చేయటంలో సీఎం జగన్ గొప్ప మనసున్న నాయకుడు.
చంద్రబాబు నాయుడుని నమ్మిన ఎన్టీఆర్ లాంటి నాయకులకి ఎటువంటి గతి పట్టిందో అందరం చూసాం. మరి వీళ్ళు అటువంటి చంద్రబాబుని నమ్మారు. నాలుగు నెలలలో వీళ్ళ పరిస్థితి అందరం చూస్తామని రోజా పేర్కొన్నారు. ఇప్పుడు అంత చంద్రబాబు మోజులో ఉన్నారు. త్వరలో ఆ మోజు మొత్తం తీరిపోద్ది. వైసీపీలో ఎవరైనా పార్టీ అధినాయకత్వం బట్టి గెలిచిన వాళ్ళు. అటువంటివాళ్లు తామేదో చేసి గెలిచినట్లు వ్యవహరిస్తే హాస్యాస్పదం. డైరెక్ట్ గా వైఎస్ జగన్ గారితో ప్రజా ప్రతినిధులకి ఎవరికి గొడవలు లేవు. అదే సమయంలో.. పార్టీ నాయకులను తన సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా జగన్ చూసుకుంటారు. అటువంటి నాయకుడిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని రోజా హెచ్చరించారు.
