Minister Roja : అప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా లేడని మంత్రి రోజా ఆవేదన
Minister Roja : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించారు. విద్యా దీవేన లబ్ది దారుల కోసం తిరుపతి సభను నిర్వహించారు. ఆ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాము చదువుకునే రోజుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు లేనందుకు బాధ పడుతున్నాను అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జగన్ అన్న ఉండి ఉంటే మా విద్యార్థులకు ఎంతో మేలు జరిగేది అన్నారు. అప్పట్లో జగన్ వంటి సీఎం లేకపోవడంతో చదువు భారంగా సాగేది అన్నట్లుగా రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంకా రోజా మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులుగా ఉన్న వారు ఎంతో అదృష్టవంతులు. మీకు మరియు మీ కుటుంబంకు ఎంతో భరోసా ఇస్తూ వైఎస్ జగన్ అన్న ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఆయన ప్రతి పథకం కూడా విద్యార్థుల కోసం అన్నట్లుగా నడిపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాలయాలను అభివృద్ది చేయడంతో పాటు విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైన భరోసా కూడా కల్పిస్తున్నారు అంటూ మంత్రి రోజా అన్నారు.
కులమతాలకు అతీతంగా వయసు తేడా లేకుండా విద్యార్థులు అందరికి కూడా సమానమైన అవకాశాలను అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ జగన్ ప్రభుత్వం పై మంత్రి ప్రశంసలు కురిపించారు. సీఎం గా ఆయన అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు. విద్యా వ్యవస్థలో ఆయన తీసుకు వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం విద్యార్థులుగా ఉన్న వారు ఎంతో లాభం పొందుతున్నారు. అందుకే నేను చదువుకునే రోజుల్లో జగన్ వంటి సీఎం ఉంటే బాగుండేదనే అభిప్రాయం ను వ్యక్తం చేయడం జరిగింది.