Minister Roja : బాపట్ల సూర్యలంక బీచ్ లో మంత్రి రోజా వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Roja : బాపట్ల సూర్యలంక బీచ్ లో మంత్రి రోజా వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :9 February 2023,6:00 pm

Minister Roja : వైసీపీ మంత్రి రోజా అందరికీ సుపరిచితురాలే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా రాణిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతోపాటు.. సాంస్కృతిక శాఖ మరియు పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పలు అందమైన ప్రదేశాలలో పర్యటిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బాపట్లలో సూర్యలంక బీచ్ లో మంత్రి రోజా సందడి చేయడం జరిగింది.

Minister Roja latest beach video on viral

Minister Roja latest beach video on viral

సముద్రం నుండి వస్తున్న అలలతో తీరంలో కాసేపు విహరించడం జరిగింది. మంత్రి రోజాతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు సూర్యలంక బీచ్ లో సందడి చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. మంత్రి బాధ్యతలు చేపట్టాక చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటూ ఉన్నారు. ప్రజల మధ్య ఉంటూ తన శాఖకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Minister Roja latest beach video on viral

Minister Roja latest beach video on viral

ఇదే సమయంలో వైసీపీ పార్టీ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో కూడా ముందుగా ఉంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విషయంలో ఎవరు ఏదైనా నోరు జారితే మాత్రం మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా రాణిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇంకా లోకేష్ విషయంలో రోజా ఇస్తున్న కౌంటర్లు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది