AP Minister RK Roja : ఒడిస్తా అనడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ.. సీఎం జగన్ అడ్డా.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 13 April 2023, 9:00 am

AP Minister RK Roja : ఏపీ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. తను ఏం మాట్లాడినా అది వివాదమే అవుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద ఈగ కూడా వాలనీయదు రోజా. తను ఇప్పుడు మంత్రి అయ్యారు. ఏపీ మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి అయ్యే అవకాశం దక్కింది. అప్పటి నుంచి ఇక ఆమె సీఎం జగన్ కు విధేయురాలు అయ్యారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ ను ఏదైనా అంటే చాలు.. వెంటనే రోజా రెచ్చిపోయి మరీ ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అయితే గడ్డిపోచలా తీసి పారేస్తారు రోజా.

AP Minister Roja: ఎన్నికల్లో వార్ వన్‌సైడే.. అందుకే చంద్రబాబుకి  ఫ్రస్ట్రేషన్ - NTV Telugu

తాజాగా ఓ మీటింగ్ లో మినిస్టర్ రోజా స్లోగాన్స్ విసిరారు. పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబుకు స్లోగన్ విసిరారు. అలాగే… సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు తనను ఎలా అవమానించారో ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా తనను అప్పుడు చంద్రబాబు అవమానించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అక్కడే కిడ్నాప్ చేసి ఇదే మాచర్లలో పోలీసులు అవమానించుకుంటూ తీసుకెళ్లి హైదరాబాద్ లో వదిలేశారని చెప్పుకొచ్చారు రోజా. కానీ.. ఇప్పుడు టీడీపీ నేతలు కుళ్లుకునేలా.. అదే పోలీసుల సెక్యూరిటీతో తాను మాచర్లలో అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు రోజా.

Minister Roja Slogans On Pawan Kalyan And Chandrababu

Minister Roja Slogans On Pawan Kalyan And Chandrababu

AP Minister RK Roja : ఇప్పుడు అదే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు

తండ్రికొడుకులు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో గల్లీగల్లీ తిరిగి అడుక్కున్నా కూడా చీ కొట్టి చీత్కరించి టీడీపీని ఓడించి ఏవిధంగా వైసీపీ జెండాను ఎగురవేశారో మనమంతా కళ్లారా చూశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా.. పవన్ కళ్యాణ్ అయినా.. ఇంకొకరు అయినా ఎవరికి కూడా బలం లేదని వాళ్లే ఒప్పుకున్నారు. జగన్ గారిని మేము ఒంటరిగా వచ్చి ఓడించలేం. కాబట్టి కలిసికట్టుగా వస్తాం అంటున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఓడిస్తాను.. ఓడిస్తాను అని చెప్పడానికి ఇది నీ అడ్డా కాదురా బిడ్డ. ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ.. సీఎం జగన్ గడ్డ అని స్లోగన్స్ విసిరారు రోజా. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి