Mint Leaves | పుదీనా ఆకుల అద్భుత గుణాలు ..వంటల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు
Mint Leaves | వంటల్లో రుచిని, సువాసనను పెంచే పుదీనా ఆకులు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, విటమిన్ ఎ, మెంథాల్, రాగి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఈ ఆకులు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా పలు వ్యాధులను దూరం చేస్తాయి.
#image_title
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది
పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న క్రిమినాశక లక్షణాలు అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో పుదీనా నీటిని తాగడం ద్వారా కడుపు సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చు.
ఆస్తమా బాధితులకు ఉపశమనం
పుదీనా ఆకులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండటంతో ఆస్తమా లేదా ముక్కు దిబ్బడ సమస్యలున్న వారికి ఎంతో ఉపయోగకరం. పుదీనా నీటిని ఆవిరి పీల్చడం ద్వారా శ్వాస సమస్యలను తగ్గించుకోవచ్చు.
జలుబు, దగ్గుకు సహజ మందు
పుదీనా ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా టీ తాగడం ద్వారా గొంతు ఇన్‌ఫెక్షన్, ముక్కు దిబ్బడ వంటి ఇబ్బందులు తగ్గుతాయి.
తలనొప్పి నుండి ఉపశమనం
పుదీనా ఆకుల సువాసన మెదడుకు చల్లదనాన్ని అందించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. పుదీనా నూనె లేదా పుదీనా బామ్‌తో కపాలం, మెడపై మసాజ్ చేయడం ద్వారా తలనొప్పి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.