Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కోసం తన సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్ తోనే దాదాపు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది OG సినిమా. మామూలుగానే స్టార్ హీరోల సినిమాలు వస్తే థియేటర్స్ అన్ని ఆ సినిమానే వేస్తాయి. మల్టీప్లెక్స్ లలో మాత్రమే వేరే సినిమాలకు స్క్రీన్స్ దొరుకుతాయి. అలాంటిది పవర్ స్టార్ సినిమా, ఇంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్, మల్టిప్లెక్స్ స్క్రీన్స్ అన్ని OG తోనే నిండిపోతాయి.

#image_title
ఫ్యాన్స్ ఫిదా..
ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు 550 షోలు వేస్తున్నారు, అవన్నీ ఆల్రెడీ హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జ, నిర్మాత విశ్వప్రసాద్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. OG రిలీజ్ సెప్టెంబర్ 25న మిరాయ్ సినిమా ఆడే థియేటర్స్, స్క్రీన్స్ అన్ని కూడా OG సినిమాకు ఇవ్వాలని నిర్మాత విశ్వప్రసాద్ డిసైడ్ అయ్యారు. దీంతో గురువారం మిరాయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో షోలు పడట్లేదు.
తిరిగి శుక్రవారం నుంచి సెలెక్టెడ్ స్క్రీన్ ల్లో మిరాయ్ సినిమా ప్రదర్శించనున్నారు. మిరాయ్ నిర్మాత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి చాలా క్లోజ్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఇక తేజ సజ్జ చిన్నప్పట్నుంచి మెగా అభిమాని అని తెలిసిందే. దీంతో మిరాయ్ యూనిట్ తీసుకున్న నిర్ణయానికి పవన్ ఫ్యాన్స్ తో మెగా అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.