MLA Kethireddy : పనిచేయలేక పోతే ఇంటికి దొబ్బెయ్ ప్రభుత్వ ఉద్యోగి పై ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ వీడియో వైరల్..!!
MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజా సమస్యల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు అని అందరికీ తెలుసు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించటంలో ఏపీలో ఉన్న అందరి ఎమ్మెల్యేలలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. అయితే టెక్నికల్ వల్ల లేదా ప్రభుత్వ ఉద్యోగి తప్పిదం వల్ల ఏదైనా జరిగితే అక్కడికక్కడే యాక్షన్ కూడా తీసుకుని సదరు సమస్యను పరిష్కరించడానికి… ఎంతగానో శ్రద్ధ చూపిస్తారు.
చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి సమస్యలు చాలా ఓపికగా విని.. ఎక్కడ తప్పు ఉందో తెలుసుకుని.. సరిదిద్దుతారు. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం వహిస్తే మాత్రం అక్కడికి అక్కడే యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఈ రీతిగానే ఇటీవల “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంలో 2019 దాకా ఒక పెద్దాయనకు పెన్షన్ వస్తే తర్వాత మళ్లీ ఆపేయడం జరిగింది. అయితే పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో సచివాలయ ఉద్యోగిని అడిగి అక్కడికక్కడ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సదరు సచివాలయ
ఉద్యోగి ఈ సమస్య విషయంలో సరిగ్గా వివరణ ఇవ్వలేకపోవడంతో పాటు… ఉద్యోగానికి చాలా లేటుగా 11:30 దాటాక వస్తూ వస్తున్నట్లు తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఉద్యోగం చేయటం ఇష్టం లేదా అని మండిపడ్డారు. ఇదే సమయంలో అంతకుముందు సదరు ఉద్యోగికి ఈ రీతిగానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నోటీసులు ఇవ్వటం జరిగింది. అయినా గాని అతనిలో మార్పు రాకపోవడంతో…పనిచేయలేక పోతే ఇంటికి దొబ్బెయ్ అన్న తరహాలో సదరు ప్రభుత్వ ఉద్యోగికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.