Mobile Phones | రూ.10,000 లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు .. మీ అవసరానికి తగిన ఫోన్ ఎంచుకోండి!

Authored By Sam C | The Telugu News | Published on: September 22, 2025, 9:00 pm

Mobile Phones | మీ బడ్జెట్ రూ.10,000లోపు ఉందా.. అయితే టాప్ బ్రాండ్లైన Samsung, iQOO, Poco, Realme, Vivo వంటి కంపెనీలు ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లో తమ బ్రాండ్ శైలికి తగ్గ మోడల్స్‌ను విడుదల చేశాయి. ఇందులో కొన్నింటిలో 5G సపోర్ట్, మంచి కెమెరాలు, పవర్‌ఫుల్ బ్యాటరీలతోపాటు కొత్త Android వర్షన్ల సపోర్ట్ కూడా ఉంది.

#image_title

1. Samsung Galaxy M06 5G (ధర: రూ.7,499)
తక్కువ ధరకే 5G అనుభవం కావాలంటే Samsung Galaxy M06 ఉత్తమ ఎంపిక. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, 6GB RAM, Android 15 సపోర్ట్‌తో వస్తోంది. 50MP + 2MP రేర్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ లభిస్తోంది. Samsung నుంచి నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి.

2. iQOO Z10 Lite 5G (ధర: రూ.9,998)
బ్రైట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, గొప్ప బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి ఇది బెస్ట్. 6000mAh బ్యాటరీతోపాటు 50MP సోనీ కెమెరా, Dimensity 6300 ప్రాసెసర్, 6.74 అంగుళాల స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రత్యేకతలతో వస్తోంది. నీరు, దుమ్ము, షాక్‌కు ప్రొటెక్షన్ ఉండటం ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది.

3. Poco C71 (ధర: రూ.6,989)
అతి తక్కువ ధరలో స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌ను కోరుకునే వారికి Poco C71 ఒక మంచి ఎంపిక. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (2TB వరకు పెంచే అవకాశం), 6.88 అంగుళాల డిస్‌ప్లే, 32MP రేర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5200mAh బ్యాటరీ లభిస్తోంది. ఇది సాధారణ వినియోగానికి అనువైన Unisoc ప్రాసెసర్‌పై నడుస్తుంది.

4. Realme Narzo 80 Lite 4G (ధర: రూ.8,298)
స్టైలిష్‌ డిజైన్, మెరుగైన బ్యాటరీ లైఫ్ కావాలంటే ఈ ఫోన్ బాగుంటుంది. 6300mAh భారీ బ్యాటరీతో పాటు మెరుస్తున్న పల్స్ లైట్, అధిక సౌండ్ అవుట్‌పుట్, డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌కు ఆకర్షణగా మారాయి.

5. Vivo Y19e (ధర: రూ.7,999)
రోజువారీ వినియోగదారులకు బెస్ట్ చాయిస్. 13MP + 0.08MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా, 6.74 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లతో వస్తోంది. Unisoc ప్రాసెసర్‌పై నడిచే ఈ ఫోన్ కాల్స్‌, వీడియోస్‌ కోసం తక్కువ ధరలో సరిపోతుంది.

Sam C

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp