Gas Cylinder : ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ శుభవార్త .. రూ.300కే గ్యాస్ సిలిండర్.. పూర్తి వివ‌రాలు..!

 Authored By suma | The Telugu News | Updated on :2 February 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Gas Cylinder : ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ శుభవార్త .. రూ.300కే మోడ్రన్ గ్యాస్ సిలిండర్..

Gas Cylinder : ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ అంటే మన కళ్లముందు ఒకే చిత్రం కనిపించేది. ఎరుపు రంగులో ఇనుముతో తయారైన బరువుగా ఉండే ఎల్పీజీ సిలిండర్ LPG cylinder . కాలం గడిచే కొద్దీ అవి మసకబారిపోయి తుప్పుపట్టి మట్టి అంటుకుని అసహ్యంగా మారిపోయేవి. ఇంట్లోకి తెచ్చి పెట్టాలంటేనే చేతులు నొప్పులు వచ్చేంత బరువు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సిలిండర్లను కదిలించాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఈ పరిస్థితులన్నింటికీ చెక్ పెట్టేలా ఇప్పుడు గ్యాస్ రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది.

Gas Cylinder : ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ శుభవార్త .. రూ.300కే గ్యాస్ సిలిండర్.. పూర్తి వివ‌రాలు..!

Gas Cylinder : ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ శుభవార్త .. రూ.300కే గ్యాస్ సిలిండర్.. పూర్తి వివ‌రాలు..!

Gas Cylinder : మోడ్రన్ గ్యాస్ సిలిండర్ల ఎంట్రీ

గ్యాస్ సిలిండర్ల రూపంలో సరికొత్త విప్లవం త్వరలోనే ప్రతి ఇంటికీ చేరనుంది. అత్యంత తేలికగా ఆకర్షణీయంగా ఉండే కొత్త తరం గ్యాస్ సిలిండర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వీటిని “మోడ్రన్ గ్యాస్ సిలిండర్లు”గా  Modern gas cylinders పిలుస్తున్నారు. సంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఇవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. లుక్‌లో స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా ఉపయోగంలోనూ ఎంతో సౌకర్యాన్ని అందిస్తాయి. ఇంట్లో వంటగదికి ఇవి ఒక మోడ్రన్ టచ్ తీసుకొస్తాయని చెప్పవచ్చు.

Gas Cylinder : కొత్త మెటీరియల్ – తక్కువ బరువు, ఎక్కువ బలం

ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  BPCL ఈ కొత్త సిలిండర్లను “భారత్ గ్యాస్ లైట్” పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. హై డెన్సిటీ పాలిథిలిన్  HDPE  అనే ఆధునిక మెటీరియల్‌తో వీటిని తయారు చేశారు. గ్యాస్ పూర్తిగా నింపినప్పటికీ ఈ సిలిండర్ మొత్తం బరువు కేవలం 15.9 కిలోలే. ఇనుప సిలిండర్లతో పోలిస్తే దాదాపు సగం బరువు తగ్గిపోతుంది. అంతేకాదు భద్రత విషయంలో కూడా ఇవి చాలా ముందున్నాయి. గ్యాస్ లీక్ అయినా ఒక్కసారిగా పేలిపోకుండా నెమ్మదిగా లీక్ అవుతూ ప్రెజర్‌ను తగ్గించే విధంగా డిజైన్ చేశారు.

Gas Cylinder : భద్రత, సౌకర్యం, ఆఫర్ అన్నీ ఒకే సిలిండర్‌లో

పాత ఇనుప సిలిండర్లు గరిష్ఠంగా 80 కిలోల ప్రెజర్‌ను మాత్రమే తట్టుకుంటే ఈ కొత్త సిలిండర్లు 120 కిలోల వరకు ప్రెజర్‌ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. బ్లూ, ఎల్లో రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ సిలిండర్లలో మరో ప్రత్యేకత కూడా ఉంది. గ్యాస్ ఎంత మిగిలి ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక చిన్న కిటికీ లాంటి భాగాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్యాస్ లెవల్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో తుప్పు పట్టడం, మరకలు పడటం వంటి సమస్యలు ఉండవు. ఈ కొత్త సిలిండర్ అసలు ధర రూ.3,350గా నిర్ణయించారు. అయితే పాత ఇనుప సిలిండర్‌ను తిరిగి ఇచ్చేస్తే కేవలం రూ.300 మాత్రమే చెల్లించి ఈ మోడ్రన్ సిలిండర్‌ను పొందే అవకాశం ఉందని బీపీసీఎల్ ప్రకటించింది. ఈ కొత్త గ్యాస్ సిలిండర్లు వంటగదిలో భద్రత, సౌకర్యం, అందాన్ని ఒకేసారి తీసుకొస్తున్నాయి. భవిష్యత్తు వంటగదికి ఇది నిజంగా ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి