
Modi : మోదీ సర్కార్ సరికొత్త పాలసీ.. సక్సెస్ కి కారణం ఇదే...!
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి ఇష్టపడని మావోలతో చర్చలు సాగించడానికే ఆసక్తి చూపింది యూపీఏ ప్రభుత్వం. ఫలితంగా- నక్సల్ ఉద్యమం దేశంలోని మధ్య- తూర్పు ప్రాంతాలపై పట్టు సాధించగలిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై వినూత్న పంథాను అనుసరించింది.
Modi : మోదీ సర్కార్ సరికొత్త పాలసీ.. సక్సెస్ కి కారణం ఇదే…!
ఈ పోరాటంలో స్పష్టతను తీసుకుని రాగలిగింది. దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయాన్ని సాధించగలిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో ప్రభుత్వం ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ ఆక్టోపస్ వంటివి చేపట్టింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, భారత్ మాల పరియోజన వంటి పథకాల ద్వారా దోపిడీకి గురైన మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లను వేసింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో వాటిని అనుసంధానించింది.
ఈ రోడ్లు- మార్కెట్లు, పాఠశాలలను చేరువ చేసిందక్కడి గిరిజన, ఆదివాసీలకు. అక్కడి వారికి ప్రభుత్వం పునరావాసాన్ని కల్పించగలిగింది. ఇది కూడా సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది మాజీ నక్సల్స్ వృత్తి శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకున్నారు. సమాజంలో గౌరవప్రదంగా జీవితాన్ని స్వీకరించడానికి లొంగిపోయారు. శాంతిభద్రతలను పునరుద్ధరించిన తర్వాతే శాశ్వత శాంతి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. తుపాకులు పట్టుకుని అమాయకులను హత్య చేసే వారితో బీజేపీ ఎలాంటి చర్చలు జరపబోదని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాత వ్యూహాలను అనుసరించాలంటూ డిమాండ్ చేస్తోన్న చోట.. బీజేపీ కొత్త భవిష్యత్తు నిర్మాణానికి పూనుకుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.