Modi : ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం…ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…!
ప్రధానాంశాలు:
Modi : ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణం...ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి...!
Modi : భారతదేశంలో నివసించే చాలామంది ప్రజలకు సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. కానీ చాలామందికి ఆ కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఇది ప్రాథమిక అవసరం అయినప్పటికీ కూడా దానిని సాధించడం అందరికీ సాధ్యం కాదు. ధనవంతులు వేల కోట్లు పెట్టి సొంత ఇల్లు నిర్మించుకుంటే నిరుపేదలు అలాగే మధ్యతరగతి ప్రజలు వారి ఇంటి కలను సహకారం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అయితే ఈ విషయాన్ని గమనించిన భారతీయ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి మరియు నిరుపేద ప్రజలకు కనీసం చిన్న ఇంటిని అయినా నిర్మించుకునే విధంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రాజెక్టు గురించి తాజాగా 2024 – 25 బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ పథకం గురించి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది చాలామందికి చేరువైన పథకం. ఇక ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు చాలామంది ఈ పథకం ద్వారా సొంత ఇళ్ళను నిర్మించుకున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 లక్షల కాంక్రీట్ ఇల్లను నిర్మించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పథకం 2014 నుండి నడుస్తుండగా 2025 నాటికి కోటి ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విజయవంతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా డబ్బును ఈ పథకానికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగానే గత సంవత్సరం 2023 – 24 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దాదాపు 790 బిలియన్ రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
ఇక ఇప్పుడు అంటే 2024 – 25 సంవత్సరంలో ఈ మొత్తాన్ని 15 శాతం పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 1013 బిలియన్ రూపాయలను ఈ పథకం కింద ఇల్ల నిర్మాణానికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ వారి సొంత ఇంటి పైకప్పును నిర్మించుకోవడానికి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందవచ్చు. ఇక ఈ సబ్సిడీ మీరు బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు , వాణిజ్య సంస్థలు ద్వారా పొందవచ్చు.