modi hyderabad tour tomorrow this is the schedule
Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపధ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేసారు అధికారులు. రేపు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో ప్రధాని పర్యటన ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు MI-17 హెలికాప్టర్‌లో బయల్దేరి, 2:35 గంటలకు చేరుకుంటారని అధికారులు వివరించారు.
మధ్యాహ్నం 2:45 గంటల నుంచి 4:15 వరకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఆ తర్వాత అదే కార్యక్రమంలో ఇక్రిశాట్ నూతన లోగోను మోడీ ఆవిష్కరిస్తారు అని అధికారులు వివరించారు.ఇక సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ ఆశ్రమానికి మోదీ వెళ్తారని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అధికారులు పేర్కొన్నారు.
modi hyderabad tour tomorrow this is the schedule
రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోడీ పాల్గొంటారు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 8:25 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఇక హైదరాబాద్ లో మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు అధికారులు.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.