Modi : రేపే మోడీ హైదరాబాద్ టూర్, షెడ్యూల్ ఇదే…!

Authored By venkat G | The Telugu News | Updated on : 4 February 2022, 12:15 pm

Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపధ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేసారు అధికారులు. రేపు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో ప్రధాని పర్యటన ఉంటుంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2:10 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారని ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు MI-17 హెలికాప్టర్‌లో బ‌య‌ల్దేరి, 2:35 గంట‌ల‌కు చేరుకుంటారని అధికారులు వివరించారు.

మధ్యాహ్నం 2:45 గంట‌ల నుంచి 4:15 వ‌ర‌కు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఆ తర్వాత అదే కార్యక్రమంలో ఇక్రిశాట్ నూత‌న లోగోను మోడీ ఆవిష్కరిస్తారు అని అధికారులు వివరించారు.ఇక సాయంత్రం 5 గంట‌ల‌కు ముచ్చింత‌ల్‌లోని చిన్నజీయ‌ర్ ఆశ్రమానికి మోదీ వెళ్తారని స‌మ‌తామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అధికారులు పేర్కొన్నారు.

modi hyderabad tour tomorrow this is the schedule

modi hyderabad tour tomorrow this is the schedule

రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది వేడుక‌ల్లో మోడీ పాల్గొంటారు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 8:25 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఇక హైదరాబాద్ లో మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు అధికారులు.

venkat G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి