Money Tips : 160 కట్టుకుంటూ పోతే.. చేతికి రూ.11 లక్షలు..
Money Tips : ప్రస్తుత కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటే అందులో ఫస్ట్ గుర్తొచ్చేది షేర్ మార్కెట్. దాని తర్వాత మ్యూచవల్ ఫండ్. ఇందులో నెలకు ఇంతా అని ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ప్రాతిపాదికన మనకు వచ్చే డబ్బుల్లో సైతం మార్పు వస్తుంది. అంటే మనం కట్టే డబ్బులను బట్టి మనకు రాబడి వస్తుంది. తక్కువగా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రాబడి వస్తుంది. ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా రాబడి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి గరిష్ఠ పరిమితి అని ఉండదు. మనకు కావాల్సినంత డబ్బును ఇందులో డిపాజిట్ చేయొచ్చు.
కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే మందుకు ఫండ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి.మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 12 శాతం నుంచి 20శాతం వరకు రాబడిని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల మీరు ప్రతి నెలా కొంత డబ్బును ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో రిస్క్ ఎక్కడ ఉందో ముందే గుర్తిస్తే ప్రయోజనం ఉంటుంది. లేదంటే నష్టాలు వచ్చే చాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించడం మంచిది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలని మీరు నిర్ణయించుకుంటే.. ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకోవడం మంచిది.
వీటిలో సిప్ రూపంలో డబ్బులు పెట్టుకుంటూ రావాలి. సిప్ చేయడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. దీనికి తోడు మార్కెట్ రిస్క్ సైతం తక్కువగా ఉంటుంది. ఒకే సారి కాకుండా ప్రతి నెలా సిప్ చేస్తూ వస్తే బాగుంటుంది. ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలనెలా దాదాపుగా రూ.5 వేలు పెట్టాలని అనుకుంటే.. అంటే రోజుకు దాదాపు రూ.165 మేర పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తే.. రూ.11 లక్షలకు పైగా రాబడి పొందొచ్చు. కానీ మీరు ఇలా దాదాపు 10 సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్ చేయాలి.