BCCI | బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BCCI | బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 September 2025,2:00 pm

ప్ర‌పంచంలోనే ధ‌నిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్ర‌స్తుతం బీసీసీఐ ఖాతాలో వేల కోట్ల రూపాయ‌లు ఉన్నాయి. 2019లో బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ రూ.6059 కోట్లుగా ఉంది. 2024 నాటికి రూ.20,686 కోట్ల‌కు చేరుకుంది. అంటే గ‌త ఐదేళ్ల‌లో రూ.14,627 కోట్ల మేర బ్యాలెన్స్‌ను పెంచుకుంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌ర‌మే రూ.4193 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి.

#image_title

కాస్త త‌గ్గుద‌ల‌..

బీసీసీఐ సాధార‌ణ నిధి దాదాపు రెట్టింపు అయిందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. 2019లో రూ.3,906 కోట్లు ఉండ‌గా 2024లో రూ.7,988 కోట్లకు చేరుకున్న‌ట్లు తెలిపింది. అంటే రూ 4082 కోట్ల రూపాయ‌ల వృద్ధిని న‌మోదు చేసింది. బీసీసీఐ ఆర్థిక విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణాలు ఐపీఎల్ నుంచి వ‌చ్చిన లాభాలు, ఐసీసీ నుంచి వ‌చ్చిన ఆదాయం.కాగా.. 2023లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్‌లో నిర్వ‌హించ‌గా, దీంతో మీడియా హ‌క్కుల ఆదాయం 2524.80 కోట్ల నుంచి 813.14 కోట్ల‌కు ప‌డిపోయింది.

అయితే బీసీసీఐ బ్యాంక్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ ఆదాయం 533.50 కోట్ల నుంచి 986.45 కోట్ల‌కు పెర‌గ‌డం విశేషం. బీసీసీఐ ఆర్థిక సంవత్సరంలో 3,150 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను బాధ్యతల కోసం కేటాయించింది. ఐపీఎల్ ఆదాయాలు, ఐసీసీ పంపిణీల సహాయంతో బీసీసీఐ 2023-24కి రూ.1,623.08 కోట్ల మిగులును నమోదు చేసింది. ఇది గత సంవత్సరం రూ.1,167.99 కోట్ల కంటే ఎక్కువ మొత్తం. 2023-24 సంవత్సరానికి బీసీసీఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,200 కోట్లు, ప్లాటినం జూబ్లీ బెనివలెంట్ ఫండ్ కోసం రూ.350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది