Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉంది.
#image_title
22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి సుమారు 600 కి.మీ దూరంలో, విశాఖకు 700 కి.మీ, కాకినాడకు 650 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారి, రాత్రికి తీరం తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 90 నుండి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.తుఫాన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని NDRF, SDRF టీమ్స్ కాకినాడ, కోనసీమ ప్రాంతాలకు చేరుకున్నాయి. తీర ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లకుండా, అధికారులు సూచించిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది.