Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి నాటికి ఇది కాకినాడ సమీపంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.తుఫాన్ సమీపిస్తున్న కొద్దీ వాతావరణం మరింత కఠినంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#image_title
గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు , గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం వరకు వీస్తాయని అంచనా. దీంతో నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరప్రాంతాల్లో అలలు 4.7 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని IMD, INCOIS సంస్థలు హెచ్చరించాయి. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడ, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
మొంథా తుఫాన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
* రూమర్లు, అపోహలను నమ్మవద్దు; అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి.
* మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసుకుని ఉంచండి.
* వాతావరణ హెచ్చరికల SMS, రేడియో, టీవీ అప్డేట్స్‌ను గమనించండి.
* అత్యవసర వస్తువులు (ఔషధాలు, టార్చ్, తాగునీరు, డ్రై ఫుడ్, బ్యాటరీలు) సిద్ధంగా ఉంచండి.
* అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి.
* విలువైన పత్రాలు, వస్తువులను వాటర్ ప్రూఫ్ కవర్లలో ఉంచండి.
* ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి; గ్యాస్ కనెక్షన్లు, ఎలక్ట్రిక్ పరికరాలను తొలగించండి.
* పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దు.
* పశువులను విడిపించి సురక్షిత ప్రదేశాలకు తరలించండి.
* మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు.