గంజాయికి బానిస‌గా మారుతున్న కొడుకు.. త‌ల్లి ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

గంజాయికి బానిస‌గా మారుతున్న కొడుకు.. త‌ల్లి ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 April 2022,7:30 pm

Telangana:ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్ల‌ల‌కు కూడా గంజాయికి బానిస‌లుగా మారుతున్న విష‌యం తెలిసిందే. పోలీసులు, అధికారులు.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపిన కూడా గంజాయి విక్ర‌యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కు గంజాయికి బానిస‌లుగా మారుతున్నారు. తాజాగా సూర్యాపేట లో గంజాయి కి బానిసగా మారిన కొడుకును మార్చుకునేందుకు ఓ తల్లి పడుతున్న కష్టం చూస్తే ప్రతి ఒక్కరి మనసు చలించక మానదు. కోదాడ కు చెందిన 15 ఏళ్ల యువకుడు గంజాయికి బానిసగా మారాడు. ఇంటికి రాకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ గంజాయి సేవిస్తున్నాడు. ఎంత చెప్పిన విన‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు.

రోజూ గంజాయి మ‌త్తులో ఊగిపోతున్నాడు. క‌ళ్ల‌ముందే తాను క‌న్న క‌ల గంజాయి రూపంలో ఆవిర‌వుతుంటే ఆ త‌ల్లి త‌ట్టుకోలేక‌పోయింది. కొడుకును ఎలాగైనా దారికితెచ్చుకోవాల‌ని మ‌మ‌కారం చంపుకుని కొడుకును తాళ్ల‌తో చెట్టుకు క‌ట్టేసి కంట్లో కారంపెట్టింది. ఏం చేయాలో దిక్కుతోచక చేతికి దొరికిన కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టింది తల్లి. కన్నీళ్లు పెట్టుకొని చెప్పినా వినడం లేదని..అందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. గంజాయి లేకుండా చర్యలు తీసుకోవాలని..తన కొడుకును ఈ మత్తు బారి నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోందామె.

mother punishment to ganja addicted son in teleangana

mother punishment to ganja addicted son in teleangana

దారికి తెచ్చుకునే ఉద్దేశంతో

కోదాడలో ఈ ఒక్క తల్లిదే కాదు. డ్రగ్స్‌, గంజాయికి బానిసలుగా మారిన ప్రతి బిడ్డ తల్లిదీ ఇదే ఆవేదన. చెడు వ్యసనాల బారిన పడిన కొడుకులను ఎలా దారిన పెట్టుకోవాలో తెలియక ఎంతో మంది మథనపడిపోతున్నారు. గంజాయికి బానిసలైన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స చేయించాల‌ని కోరుతున్నారు. గంజాయి, డ్ర‌గ్స్ ఇప్పుడు పెను భూతాలుగామారి క‌డుపుకోత‌ను మిగిలిస్తున్నాయి. చెట్టంత‌ కొడుకు ఓ వ్య‌స‌నానికి బానిసై చేతికిరాకుండా పోతుంటే త‌ల్లిదండ్రులు ప‌రిస్థితి హృద‌య విదార‌కంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది