Khammam : దుమ్ముగూడెంలో 4.21 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న పోలీసులు
Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అంజుబాక వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కారును అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో కారును ఆపి చెక్ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఆ కారును సీజ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కారులో తరలిస్తున్న గంజాయి సుమారు 4.21 క్వింటాళ్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కారు ఆపగానే.. నిందితులు పరారు అయ్యేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ప్యాకెట్లుగా ప్యాక్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిసింది. ఏపీలోని సీలేరు నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.