MP Ram Mohan Naidu : 41వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పీచ్..ఇప్పుడు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MP Ram Mohan Naidu : 41వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పీచ్..ఇప్పుడు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :21 April 2023,1:00 pm

MP Ram Mohan Naidu : మూడు వారాల క్రితం తెలంగాణలో 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున టీటీడీపీ కేడర్ తరలి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడిన స్పీచ్ చాలా హైలెట్ అయ్యింది. ఆ వీడియో సాంగ్స్ వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

MP Ram Mohan Naidu slams CM Jagan over drug issue - TeluguBulletin.com

వై నాట్ 175 అని డైలాగ్ వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికలలో వై నాట్ పులివెందుల అనీ అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా గెలిచేలా క్యాడర్ దిమ్మ జరిగే కౌంటర్ ఇచ్చిందని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తున్నారంటే.. నిధుల కోసమో లేకపోతే హక్కుల కోసమో పోరాడటానికి వెళ్తున్నారని భావించేవాళ్లు. కానీ వైయస్ జగన్ ఢిల్లీకి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన పేరు రాకుండా జాగ్రత్త పడటానికి…

MP Ram Mohan Naidu COMMENTS On CM YS Jagan At TDP 41st Formation Day Celebrations

MP Ram Mohan Naidu COMMENTS On CM YS Jagan At TDP 41st Formation Day Celebrations

రాష్ట్ర హక్కులను కాలరాయడానికి వెళ్తున్నారని రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ 2020 అనీ పెట్టుకొని ఆనాడు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఈనాడు ప్రపంచం మొత్తం హైదరాబాదు వైపు చూసేలా చేసిందని ప్రశంసించారు. ఆ రీతిగానే అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు పూనుకుంటే జగన్ అధికారంలోకి వచ్చి నాశనం చేశారని మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చి అమరావతిని కాపాడుకోవాలని.. ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో బలపడనుందని.. మంచి భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది