Revanth Reddy : టెస్టులు తగ్గిస్తే.. కరోనా వ్యాప్తి ఆగుతుందా? తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన రేవంత్ రెడ్డి?
Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచింది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా కరోనా పేషెంట్లే. ఆక్సీజన్ సిలిండర్ల కొరత, వెంటిలేటర్ల కొరత, బెడ్స్ కొరత వల్ల చాలామంది కరోనా రోగులు చనిపోతున్నారు. కరోనా వ్యాప్తి రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. కరోనా వ్యాక్సిన్ ను కూడా పంపిణీ చేస్తున్నా… వెనువెంటనే అందరికీ వేస్తున్నా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే… ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సీజన్ సిలిండర్లు, వ్యాక్సిన్లు, వెంటిలేటర్లు, బెడ్స్ కొరతే కాదు… కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవడం చేసే టెస్టింగ్ కిట్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా టెస్టింగ్ కిట్ల కొరత వల్ల చాలా చోట్ల కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో చాలామంది కరోనా టెస్ట్ కోసం వచ్చినవాళ్లు పడిగాపులు కాస్తున్నారు. అసలు తమకు కరోనా వచ్చిందో లేదో తెలియక సతమతమవుతున్నారు.
Revanth reddy : కరోనా టెస్టింగ్ కిట్ల కొరతపై రేవంత్ రెడ్డి ఫైర్?
ఓవైపు కరోనా తీవ్రంగా విజృంభిస్తుంటే కరోనా టెస్టులు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. టెస్టింగ్ కిట్లు లేవని చెప్పి కరోనా టెస్టులు చేయకుండా… కరోనా కేసులను తగ్గించి చెప్పాలని ప్రయత్నిస్తే కరోనా తగ్గుతుందా? ఇలాంటి పనులు చేయడం వల్ల కరోనా కేసులు ఇంకా పెరగడంతో పాటు.. కరోనా మరణాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కరోనా టెస్టులను ఆపకండి. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకండి. వెంటనే కరోనా టెస్టులను పెంచండి.. అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి కరోనా టెస్టింగ్ కిట్ల కొరత అంటూ మీడియాలో వచ్చిన కథనాలను జత చేసి తెలంగాణ సీఎంవోకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Reducing the number of tests does not limit #covid spread. This false picture is a very dangerous attempt and can increase the death toll. I demand @TelanganaCMO to increase the number of tests immediately pic.twitter.com/HOWVuWHKd3
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2021