Mukesh Ambani : ముకేష్ అంబానీనా మజాకానా.. బిజినెస్‌లోనే కాదు, డ్యాన్సింగ్‌లోను నెం.1..!
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన ఎంత ఎదిగిన ఒదిగే ఉంటారు.ఇక ఆయన నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముకేష్ అంబానీ తన కుమారుడి పెళ్లి వేడుక ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ లో జరిగింది. మూడు రోజుల వేడుకలు శుక్రవారం కాక్‌టెయిల్, డ్రోన్ షో, అంతర్జాతీయ పాప్ ఐకాన్ రిహన్న గొప్ప ప్రదర్శనతో ప్రారంభమయ్యాయి. అయితే అవన్నీ జరగకముందే నీతా, ముఖేష్ అంబానీ తమ అతిథులను సూపర్ రొమాంటిక్ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచారు.
ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో ముఖేష్ అంబానీ- నీతా అంబానీ ‘ప్యార్ హువా ఇక్రార్ హువా’ సినిమా పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేసింది.ఇక అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం జూలై 12న చాలా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఆ వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి అతిరథమహారథులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఆ వివాహ వేడుకలో అందరు తమ స్టెప్పులతో అలరించారు. ఇక తాజాగా అంబానీ దంపతులకు సంబంధించిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Mukesh Ambani : ముకేష్ అంబానీనా మజాకానా.. బిజినెస్‌లోనే కాదు, డ్యాన్సింగ్‌లోను నెం.1..!
భార్య నీతా అంబానీతో కలిసి రొమాంటిక్ సాంగ్‌కు కాలు కదిపారు. బాలీవుడ్ చిత్రంలోని “గీత్ హమారే ప్యార్ కే” పాటకు ఈ కపుల్ డ్యాన్స్ వేయగా, ఇందులో ముఖేష్ అంబానీ ముఖం చాలా సీరియస్‌గా పెట్టినప్పటికీ కాస్త రొమాన్స్‌ను పండించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నీతా అంబాని విషయానికి వస్తే ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్. అందుకే తన నృత్యంతో ఎంతగానో ఆకట్టుకుంది. అనంత్ అంబాని వేడుకకి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరై తెగ సందడి చేశారు. వారి డ్యాన్స్‌లతో వినోదం పంచారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.