Shares : ల‌క్షాధికారుల‌ని చేస్తున్న షేర్స్..ల‌క్ష‌కి 14 ల‌క్ష‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shares : ల‌క్షాధికారుల‌ని చేస్తున్న షేర్స్..ల‌క్ష‌కి 14 ల‌క్ష‌లు

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2025,3:00 pm

Shares : ఈ మ‌ధ్య కాలంలో షేర్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కొంతకాలంగా చూస్తే ఈ స్టాక్స్ పెట్టుబడిదారులకు చాలా మంచి లాభాన్ని ఇచ్చాయి. విశేషం ఏంటంటే 2020 తర్వాత డిఫెన్స్ స్టాక్స్‌లో ర్యాలీ ఊపందుకుంది. రక్షణ బడ్జెట్ పెరుగుదల, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ, పెరుగుతున్న ఎగుమతి మార్కెట్ ఈ పెరుగుదలకు దారితీశాయి.

Shares : మంచి ఫ‌లితాలు..

2020లో ఒక పెట్టుబడిదారుడు ఈ రెండు స్టాక్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే నేడు దాని విలువ రూ.14 లక్షలు అయ్యేది. అంటే కేవలం 5 సంవత్సరాలలో 14 ల‌క్ష‌లు రాబడి. అయితే, ఇంత పెరుగుదల తర్వాత ఇప్పుడు వాటిలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. HAL ఇప్పటివరకు 4,200 కి పైగా విమానాలను, 5,200 ఇంజిన్లను తయారు చేసింది. వీటిలో భారతదేశంలోనే తయారు చేసిన 17 రకాల డిజైన్లు ఉన్నాయి. ఇది కాకుండా HAL 11 వేల కంటే ఎక్కువ విమానాలు, 33 వేల ఇంజిన్ల మరమ్మతులు కూడా చేసింది.

Shares ల‌క్షాధికారుల‌ని చేస్తున్న షేర్స్ల‌క్ష‌కి 14 ల‌క్ష‌లు

Shares : ల‌క్షాధికారుల‌ని చేస్తున్న షేర్స్..ల‌క్ష‌కి 14 ల‌క్ష‌లు

భవిష్యత్తులో కూడా HAL మంచి ఆర్డర్‌లను పొందుతుందని భావిస్తున్నారు. రాబోయే 3-6 నెలల్లో రూ.1.33 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు (156 లైట్ కంబాట్ హెలికాప్టర్లు, 97 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-Mk1Aతో సహా) వస్తాయని భావిస్తున్నారు. దీనితో పాటు, 60 యుటిలిటీ హెలికాప్టర్లు-మారిటైమ్, 43 అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లకు ఆర్డర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గత సంవత్సరం కంటే 15% పెరిగి రూ.202.7 బిలియన్లకు చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సైన్యం నుండి రూ.250 బిలియన్లు, భారత నావికాదళం నుండి రూ.150 బిలియన్ల విలువైన ఆర్డర్‌లను BEL అందుకుంటుందని ఆశిస్తున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది