Chandrababu : చంద్రబాబా.. బొక్కా.. మినిమమ్ కేర్ చేయట్లేదు బాబోయ్
Chandrababu : టీడీపీ పార్టీకి చంద్రబాబే అంతా. ఆయన తర్వాతే ఎవరైనా. ఆ పార్టీకి ఆయన అధినేత. ఆయన కనుసన్నల్లోనే ఏదైనా జరుగుతుంది. ఆయన్ను కాదని ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే చాన్స్ లేదు. కానీ.. చంద్రబాబు అంటే టీడీపీకి చెందిన ఆ ఇద్దరు నేతలకు మాత్రం అస్సలు భయం లేదట. ఎందుకంటే… ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయిన విషయం తెలిసిందే.ఈ సమావేశానికి మాజీ ఎంపీ రాయపాటి కూడా వీల్ చైర్ లో హాజరయ్యారు. దీంతో ఆయన్ను అందరూ శెభాష్ అంటూ పొగిడారు. కానీ.. ఈ సమావేశానికి ఇద్దరు ముఖ్యనేతలు మాత్రం హాజరుకాలేదు.
ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు అంటారా? ఒకరు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ( nara lokesh ).ఓవైపు పార్టీలో కీలక నేత. మరోవైపు చంద్రబాబు కొడుకు.. నారా లోకేశ్. ఈయన సమావేశానికి రాకపోవడం ఏంటి అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఓవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు సీరియస్ గా క్లాసులు పీకుతున్నారు. కానీ.. టీడీపీ (TDP)కి చెందిన ముఖ్య నేతలే చంద్రబాబుతో సమావేశానికి హాజరుకాకపోవడం ఏంటి అంటూ టీడీపీలోనే ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గానికి చెందిన గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఏంటి..
Chandrababu : పార్టీలో కీలక నేత అయి ఉండి సమావేశానికి రాకపోవడం ఏంటి?
అధినేతతోనే సమావేశానికి ఎందుకు గైర్హాజరు అయ్యారు. ఇలాంటి నేతల వల్ల వచ్చే లాభం ఏంటి అంటూ టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుతో అన్నారట. ముఖ్యమైన సమావేశాలకు కూడా ముఖ్యమైన నేతలు రాకపోతే చంద్రబాబు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అంటూ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏదైనా నారా లోకేశ్, గల్లా జయదేవ్ తీరుపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి.. నారా లోకేశ్, గల్లా జయదేవ్ పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.