Taraka Ratna : ఏడ్చేసిన నారా లోకేష్ – తారకరత్న విషయంలో తన తప్పు ఒప్పుకున్నాడు..!
Taraka Ratna : నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నందమూరి కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా నారా ఫ్యామిలీ, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం.. నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర రోజే తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోవడం. అవును.. నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన రోజే తాను కూడా పాల్గొన్నారు. కానీ.. అంతలోనే రోడ్డు మీదనే కుప్పకూలిపోయారు తారకరత్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు మృత్యువుతో పోరాడి చివరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇప్పటికే నందమూరి వంశంలో చాలామంది మృత్యువాత పడ్డారు.
తాజాగా మరో వ్యక్తి నందమూరి కుటుంబం నుంచి ప్రాణాలు వదలడంతో నందమూరి కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయింది. కేవలం 39 ఏళ్లకే ఆయన మరణించడం అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇదివరకు ఎప్పుడూ తారకరత్నకు అనారోగ్యం సోకలేదు. ఎప్పుడూ గుండెకు సంబంధించిన జబ్బులు రాలేదు. కానీ.. ఇంత సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో అందరూ షాక్ అయిపోయారు. తారకరత్న బతకాలని.. ఎలాగైనా ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని బాలకృష్ణ, నారా లోకేశ్ ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేశారు. బాలకృష్ణ అయితే.. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ దగ్గరుండి ఆయనకు ట్రీట్ మెంట్ చేయించారు కానీ..
Nara Lokesh: నారా లోకేశ్, బాలకృష్ణ బాధ వర్ణనాతీతం
ఫలితం దక్కలేదు. మరోవైపు నారా లోకేశ్ కూడా అంతే. యువగళంలో బిజీగా ఉన్న నారా లోకేశ్.. ఎలాగైనా తారకరత్న కోలుకుంటారని అనుకున్నారు. కానీ.. నారా లోకేశ్ అనుకున్నది ఒకటి..జరిగింది ఇంకొకటి. ఇప్పుడు యువగళం పాదయాత్ర పరిస్థితి ఏంటి. తాను తలపెట్టిన ఒక గొప్ప కార్యక్రమం రోజే తారకరత్నకు అలా జరగడంతో లోకేశ్ చాలా బాధపడ్డారు. బావ అంటూ ఆప్యాయంగా తనను పిలిచే ఆ గొంతు ఇక వినిపించదు.. అని నారా లోకేశ్ గుండెలు పగిలేలా ఏడ్చారు. బంధుత్వం కంటే కూడా నీ స్నేహం గొప్పది.. అంటూ తారకరత్న మృతి టీడీపీ పార్టీకి తీరని లోటు అని లోకేశ్ కన్నీటి పర్యంతమయ్యారు.