
nara-lokesh-satires-on-minister-roja-in-nagari-constitution
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సాగుతోంది. మంత్రి రోజా నియోజకవర్గ కావడంతో… లోకేష్ Nara Lokesh తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గతంలో పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో శ్రీకాకుళంలో డైమండ్ రాణి అంటూ రోజాపై మండిపడటం తెలిసిందే. అయితే లోకేష్ మంత్రి రోజా అని ఉద్దేశించి డైమండ్ పాప జబర్దస్త్ ఆంటీ అని సెటైర్లు వేశారు. నియోజకవర్గంలో మంత్రి రోజా మరియు వారి కుటుంబ సభ్యులు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో భూకబ్జాలు రోజా కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతున్నాయని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో మాత్రమే కాదు… విశాఖపట్నం రిషికొండ ఏరియాలో కూడా రోజా భూ కబ్జాలకు పాల్పడిందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ఇసుక, గంజాయి, బియ్యం, స్మగ్లింగ్ జరుగుతుందని ఆరోపించారు. మొన్న పాపా అని అన్నందుకు ఫీలయింది. నన్ను క్షమించు అమ్మ ఇకనుండి నిన్ను జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తానంటూ లోకేష్ పంచ్ డైలాగులు వేశారు. నాకు చీర గాజులు పెడతానని మొన్న మధ్య వ్యాఖ్యానించింది. అంటే ఆమె ఉద్దేశంలో చేరా గాజులు కట్టుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళ అని.. లోకేష్ ప్రశ్నించారు. నీ నియోజకవర్గానికి నగరికి వచ్చాను. నువ్వు పంపిస్తాను అని చెప్పిన చీర గాజులు పంపించు అంటూ.. లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వు పంపించిన చీర గాజులు మా ఆడపడుచులకు పెట్టి వాళ్ళ కాళ్లు మొక్కుతా అని చెప్పుకొచ్చారు. అది తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం అని స్పష్టం చేశారు.
nara-lokesh-satires-on-minister-roja-in-nagari-constitution
రోజా నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే రోజా అధికారంలోకి వచ్చిందో ఆమె బెంజ్ కారు కొనుక్కోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పాలు అవటం జరిగింది. ఊరుకో విల్లా, ఆమె చెప్పులు పట్టుకోవడానికి ప్రభుత్వ అధికారులు. కానీ నగరి నియోజకవర్గ ప్రజలకు చివరాసరికి మిగిలింది గంజి నీళ్ళు… కన్నీళ్లు. గ్రానైట్ ఇంకా క్వారీలలో రోజా వాటా తీసుకుంటుందని ఆరోపించారు. ఈ రీతిగా రోజా సొంత నియోజకవర్గంలో తన పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపయి.
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…
Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్లో కీలక మలుపులు…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీకదీపం: ఇది నవవసంతం' సీరియల్ ఇప్పుడు ఎంతో…
This website uses cookies.