Nara Lokesh : నారా లోకేష్ బాబుకు కరోనా…ట్విట్టర్ వేదికగా వెల్లడి..!
Nara Lokesh : తెలుగు దేశం నేత నారా లోకేష్ బాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపిన లోకేష్.. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. ఎన్ని ముందస్తూ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని లోకేష్ తెలిపారు. త్వరలోనే ఆరోగ్యం బాగు చేసుకొని మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Nara Lokesh tested positive for Corona
మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమ అభిమాన నేత మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.